గీత గోవిందం సక్సెస్ తో స్టార్ హీరోగా మారిన విజయ్

  • August 20, 2018 / 12:51 PM IST

సరైన ప్లానింగ్ ఉంటే సినిమాతో హిట్ కొట్టడం అనేది పెద్ద సమస్యేమీ కాదు. కానీ.. ఆ సక్సెస్ తో స్టార్ డమ్ సొంతం చేసుకోవడం మాత్రం అంత ఈజీ పనేమీ కాదు. ఎందరో కొత్త నటీనటులు సక్సెస్ లు సొంతం చేసుకొని కూడా ఆ సక్సెస్ తో స్టార్ డమ్ ఎలా సంపాదించాలో, వచ్చిన స్టార్ డమ్ ను ఎలా వాడుకోవాలో తెలియక ఆ కన్ఫ్యూజన్ నుంచి తేరుకొనేలోపే ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. కానీ.. అదృష్టం కలిసొచ్చిందో లేక ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉందో తెలియదు కానీ.. సడన్ స్టార్ కంటే ఫాస్ట్ గా రాకెట్ స్పీడ్ తో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. “అర్జున్ రెడ్డి” అనంతరం “గీత గోవిందం”తో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు యంగ్ హీరోస్ లో టాప్ మాత్రమే కాదు అగ్ర కథానాయకులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు.

విజయ్ దేవరకొండ సాటి హీరోలైన నాని, నితిన్, సాయిధరమ్ తేజ్ లు ఒక్కసారిగా ఫ్లాపులతో కూలబడడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ కి నటించిన “ట్యాక్సీవాలా” విడుదలకు సిద్ధంగా ఉండగా “నోటా” షూటింగ్ జరుగుతోంది. అలాగే.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రం ఒప్పుకొన్నాడు. ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి. ఇక నిన్న జరిగిన “గీత గోవిందం” సక్సెస్ మీట్ లో చిరంజీవి ఏకంగా పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండే అని ఇండైరెక్ట్ గా ప్రకటించడం, ఈ సినిమా సక్సెస్ ని బన్నీ సెలబ్రేట్ చేయడం వంటివి గమనిస్తే విజయ్ కి మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉందని అర్ధమవుతూనే ఉంది. ఇది మాత్రమే కాకుండా విజయ్ ఓవర్సీస్ లో క్రియేట్ చేసుకొన్న మార్కెట్, యూత్ లో సంపాదించుకొన్న క్రేజ్ చూస్తుంటే.. అగ్ర కథానాయకులు కూడా కంగారుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా పెద్దలతో మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులతోనూ విజయ్ దేవరకొండకు మంచి పరిచయాలు ఉండడం ఇక్కడ విశేషం. సో, ఇదంతా చూస్తుంటే.. ఇప్పటివరకూ ఎలాంటి స్పెషల్ టైటిల్ లేని విజయ్ కి ఇండస్ట్రీ జనాలు “సూపర్ పవర్ స్టార్” అని నామకరణం చేసేందుకు సన్నద్ధమవుతున్నారని వినికిడి. చూద్దాం మరి విజయ్ దేవరకొండకి ఎలాంటి టైటిల్ ఇస్తారో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus