Kushi: విజయ్ దేవరకొండ ఖుషి మూవీ క్లైమాక్స్ ను అలా ప్లాన్ చేశారా?

  • August 28, 2023 / 12:46 PM IST

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ఖుషి మూవీ తెరకెక్కగా సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండనుందని తెలుస్తోంది.

ఖుషి (Kushi) మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులను ఏడిపించేలా ఉండనుందని తెలుస్తోంది. అలాంటి క్లైమాక్స్ తో డైరెక్టర్ శివ నిర్వాణ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తారో తెలియాలంటే మాత్రం మరో మూడు రోజులు ఆగాల్సిందే. విజయ్ దేవరకొండ ఖుషి మూవీ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఖుషి మూవీ సాంగ్స్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం.

ఖుషి మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన సీన్లు అదుర్స్ అనేలా ఉండనున్నాయని తెలుస్తోంది. విజయ్, సమంత ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమాకు భారీ రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ, సమంత కొత్త ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. తాను 13 సంవత్సరాలుగా కష్టపడుతున్నానని కెరీర్ పరంగా బ్రేక్ తీసుకోలేదని ప్రస్తుతం బ్రేక్ తీసుకొని నేను కొత్తదశని అనుభవిస్తున్నానని సమంత తెలిపారు. ప్రస్తుతం ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తున్నానని సామ్ వెల్లడించారు. ప్రస్తుతం నా లైఫ్ లో ఖుషిగా ఉన్నానని ఆమె తెలిపారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus