తన సినిమాలతో కొత్త జనరేషన్ సృష్టిస్తానంటున్న దేవరకొండ
February 11, 2020 / 05:25 PM IST
|Follow Us
విజయ్ దేవరకొండ సినిమాలు ఎంత సెన్సేషనో, వేదికలపై ఆయన సంభాషణలు, బాడీ లాంగ్వేజ్ కూడా అంతే సెన్సేషన్. తనకు అనిపించింది ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం విజయ్ మేనరిజం. ఆయన రఫ్ ఆటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా తాజా ఇంటర్వ్యూ లో కూడా విజయం కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం 10-15 ఏళ్ల వయసులో ఉన్న జనరేషన్ ని తను మార్చేస్తాడట. వారిని నచ్చినది చేసేలా, అనిపించింది మాట్లాడేలా తీర్చుదిద్దుతాడట. చిన్నప్పటి నుండి టీచర్స్ మరియు పేరెంట్స్ ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని వారిని ఆపివేస్తున్నారు, అలా కాకుండా చిన్నప్పటి నుండే వారికి ఇండివిడ్యువల్ గా బ్రతికేలా స్వంత్రంగా ఆలోచించేలా మార్చి వేస్తా అంటున్నాడు. తన సినిమాలు, మాటలతో ఒక జనరేషన్ నే మార్చేస్తా అంటున్న, విజయ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ఈనెల 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది. ఓ వైవిధ్యమైన లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లా, క్యాథరిన్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మూడు ప్రేమకథలు ఉంటాయి. ఐశ్వర్య రాజేష్ తో మాత్రం పిల్లలు, సంసారం, ఆర్థిక కష్టాలతో భాధపడే ఓ సాధారణ మధ్యతరగతి భర్తగా కనిపిస్తాడట. దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.