నాకంటే బాగా పాడకపోతే నేను మిమ్మల్ని ట్రోల్ చేస్తాను
July 30, 2018 / 06:56 AM IST
|Follow Us
రీసెంట్ టైమ్స్ లో అనవసర ప్రయోగాలకి పోయి ఇమేజ్ పాడుచేసుకొన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. తనను తాను రౌడీ అని పిలుచుకుంటూ, పిలిపించుకుంటూ.. టిపికల్ యాటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకొన్న విజయ్ దేవరకొండ మొన్నామధ్య “గీత గోవిందం” సినిమా కోసం “వాట్ ది ఎఫ్” అనే పాట పాడి తన వీరాభిమానుల చేత కూడా తిట్టించుకొన్నాడు. ఆ పాట పాడినందుకు విజయ్ ని సోషల్ మీడియాలో మామూలుగా ఆడుకోలేదు. మనోడి వచ్చిన మీమ్స్ కి అందరూ పడిపడి నవ్వుకొన్నారు. ఆఖరికి ఆ పాటను కొందరి మనోభావాలు దెబ్బ తిన్న కారణంగా యూట్యూబ్ నుంచి తొలగించినప్పటికీ.. విజయ్ ను ట్రోల్ చేయడం ఆపలేదు.
వేరే హీరోలైతే ఈ ట్రోలింగ్ పట్ల ఎలా రియాక్ట్ అయ్యేవారో తెలియదు కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకొన్నాడు. తనపై వచ్చిన ట్రోల్స్ ను తానే స్వయంగా ఆడియో వేడుకలో ప్లే చేయించుకొని మరీ “నన్ను ఒక రెండ్రోజులు గట్టిగా ఏసుకున్నారు కదరా భయ్, ఏదో సరదాగా పాడాను మీకు నచ్చలేదు. సరే మీకోక ఆప్షన్ ఇస్తున్నాను.. ఇదే పాటను ఎవరైనా నాకంటే బాగా పాడగలిగితే నాకు ఆడియో కానీ వీడియో కానీ పంపండి, నచ్చితే వాళ్లతోనే సినిమాలో పాడిస్తాను. నచ్చకపోతే మాత్రం నేను మిమ్మల్ని ట్రోల్ చేస్తాను” అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్ మెంట్ కి ఆడియో వేడుకకు వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు ఆన్ లైన్ లో ఈ వేడుకను చూస్తున్నవాళ్లు కూడా షాక్ అయ్యారు. వెంటనే విజయ్ పాజిటివ్ యాటిట్యూడ్ ను గమనించి అతడ్ని మెచ్చుకొన్నారు. ఏదైమైనా సుమ అన్నట్లు ఒక హీరో తన మీద వచ్చిన ట్రోల్స్ ను తానే స్వయంగా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ప్లే చేయించుకొని మరీ వాటన్నిటికీ సమాధానం ఇవ్వడం అనేది మామూలు విషయం ఏమీ కాదు.