Vijay, Ananya: ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనన్య ముద్దు సీన్ వైరల్!

  • July 22, 2022 / 06:04 PM IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికోసం హైదరాబాద్, ముంబైలలో ఈవెంట్స్ ను నిర్వహించారు. ముంబైలో ఈవెంట్ కి రణవీర్ సింగ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన రణవీర్ తన అల్లరితో, మాటలతో అందరినీ అలరించారు.

విజయ్ దేవరకొండ ఈవెంట్ కి చాలా సింపుల్ గా రావడంతో రణవీర్ అతడిని తెగ పొగిడేశాడు. అంతేకాదు.. విజయ్ దేవరకొండ చెప్పులు వేసుకొని రావడంతో స్టేజ్ పై కాసేపు విజయ్ ని ఆదుకున్నారు రణవీర్ సింగ్. జాన్ అబ్రహం తరువాత ఆ రేంజ్ లో స్వాగ్ చూపిస్తుంది విజయ్ దేవరకొండే అంటూ కామెంట్స్ చేశారు. ఆ తరువాత ‘లైగర్’ సినిమాలో ‘అకిడి.. పకిడి’ సాంగ్ కి విజయ్, రణవీర్, అనన్య కలిసి డాన్స్ చేశారు.

సాంగ్ చివర్లో విజయ్ టక్కున అనన్య పాండేకి ముద్దు పెట్టారు. ఆ తరువాత ఆమె రణవీర్ ని ముద్దు అడగ్గా.. అతడు పక్కకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనన్య సరదాగా హీరోని ముద్దు అడిగినప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. పూరి జగన్నాధ్ రూపొందించిన ఈ సినిమాను అతడితో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు.

బాలీవుడ్ లో కరణ్ జోహారే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ అయితే ఓ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus