‘వరల్డ్ ఫేమస్ లవర్’ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ఇంటర్వ్యూ..!
February 14, 2020 / 01:50 PM IST
|Follow Us
నేను ఇప్పటికీ చిన్నపిల్లాడినే.. పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదేమో.. అంటున్నాడు మన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ’. ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ నుండీ వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె.ఏ.వల్లభ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా వంటి క్రేజీ భామలు ఈ చిత్రంలో హీరోయిన్లు గా నటించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించడంతో ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో విజయ్ దేవరకొండ పాల్గొని విలేకర్లు అడిగిన ప్రశ్నలకి ఆసక్తి కరమైన సమాదాలనాలు చెప్పాడు.
లవ్ స్టోరీస్ చెయ్యను అని అనౌన్స్ చేశారు. ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ?
ప్రతీ ఒక్కరి ఫేస్ లోని చేంజెస్ వస్తుంటాయి. నేను కూడా కొంచెం మారి లవ్ స్టోరీస్ నుండీ బయటకి రావాలి అని అనుకుంటున్నాను. కొత్త కొత్త కధల్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే అలాంటి స్టెప్ తీసుకోవాలని అనౌన్స్ చేశాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండీ ఈ ఆలోచన నా మైండ్ లో ఉంది. ‘లవ్ స్టోరీస్’ చెయ్యను అంటే దాని అర్థం యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తాను అని కాదు. ‘టాక్సీవాలా’ వంటి కథలు వస్తే చేస్తాను. అలాగే పూరి గారి సినిమాల్లో ఎంత యాక్షన్ ఉన్నా.. లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీస్ చెయ్యను అని చెప్పాను.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ చూసినప్పుడు ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపిస్తున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.!
నేను ఏం చేసినా ‘అర్జున్ రెడ్డి’ తోనే పోలుస్తారు. ‘స్కైఫై’ సినిమా చేసినా.. యాక్షన్ సినిమా చేసినా.. దాంతోనే పోలుస్తారు. కానీ నేను హ్యాపీనే.. నా సూపర్ హిట్ సినిమాతోనే పోలుస్తున్నారు కదా.. ! ప్లాప్ సినిమాతో పోలిస్తే బాధపడాలి.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో సిక్సర్ కొడతారా?
బంతైతే గాల్లో ఉంది… అది బౌండరీకి అటుసైడ్ పడుతుందా.. లేక ఇటు సైడ్ పడుతుందా.. లేక ఎవరైనా క్యాచ్ పడతారా.. ? అనేది చూడాలి మరి..!(నవ్వులు)
‘డియర్ కామ్రేడ్’ ఫలితం పై మీ స్పందన?
ఆ చిత్రానికి మంచి రివ్యూస్ రాలేదు. కానీ నా పెర్ఫార్మన్స్ అలాగే రష్మిక పెర్ఫార్మన్స్ కు అవార్డు వచ్చింది. ‘ఐ యాం హ్యాపీ’. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో మేము షూటింగ్ చేస్తుంటే… నన్ను బాబీ అని పిలుస్తున్నారు. అది చాలు.. నా పాత్ర తెచ్చిపెట్టిన గుర్తింపు అది.
ఈ సినిమాలో మూడు రకాల లవ్ స్టోరీలు ఉంటాయన్నారు. మూడింటికి రిలేషన్ ఏంటి?
రెలేషన్ ఏంటి అంటే… మూడు లవ్ స్టోరీల్లో నేనే ఉంటాను. అది మాత్రమే చెప్పగలను. (నవ్వులు) అంటే కథ ప్రకారం మూడు లవ్ స్టోరీలు వస్తాయి.
ఈ చిత్రానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ తో మీరు శాటిస్ఫై అయ్యారా?
యెస్ 100 పెర్సెంట్ శాటిస్ఫై అయ్యాను. అంతకు ముందు కొన్ని పేర్లు అనుకున్నాం. కానీ మరీ 1960 లలో పేర్లు లా అనిపించాయి. ‘ప్రియం’, ‘ముంబై తీరం’ అలాంటి టైటిల్స్ అనుకున్నాం. కానీ ఇదే యాప్ట్ టైటిల్. సినిమా చూసాక మీకే తెలుస్తుంది. సినిమా బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ‘ఐ యామ్ హ్యాపీ విత్ బుకింగ్స్’.
సినిమాలో మూడు షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు కదా. అది కష్టం అనిపించిందా..?
అలాంటిది ఏమీ లేదు.. శీనయ్య పాత్ర కోసం.. మా నాన్నగారిని ఫాలో అయ్యాను. అప్పట్లో ఆయన అలాగే ఉండేవారు. ఈ సినిమాలో నేను లుంగీ ధరించిన తీరు అంతా మా నాన్న గారిదే ఫాలో అయ్యాను.
క్రాంతి మాధవ్ గారు డైరెక్షన్లో చేయడం ఎలా అనిపించింది..?
ఆయన రైటింగ్ చాలా బాగుంది. డైలాగులు కూడా చాలా బాగా అనిపించాయి. ఈ సినిమాని చాలా బాగా తీశారు.
సినిమాలో నలుగురు హీరోయిన్స్ పాత్రలలో.. మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి?
సువర్ణ (ఐశ్వర్య రాజేష్) పాత్ర చాలా బాగుంటుంది. యల్లండు బ్యాక్ డ్రాప్ లో వచ్చే శీనయ్య, సువర్ణ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది.
‘గీత గోవిందం’ టైములో ట్రోల్స్ ను .. ప్లే చేసి చూపించారు కదా? క్రిటిసిజం ను కూడా లవ్ చేస్తున్నారా ?
‘ఐ లవ్ క్రిటిసిజం’.. మన గురించి అంతలా ఆలోచించి.. మీమ్స్ చేయడం అంటే పెద్ద పని. నిద్రపోతున్నప్పుడు కూడా నన్ను తలుచుకుంటున్నారు అంటే మాటలా..!(నవ్వులు). కానీ స్టుపిడ్ గా ట్రోల్ చేస్తే నచ్చదు. ‘ఐ లవ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం’.
ప్రేమ.. పెళ్లి పై మీ అభిప్రాయం..?
ప్రేమ అంటే అప్పట్లో నాన్ సెన్స్ అనుకునే వాడిని. ఇక పెళ్లి ఫ్యూచర్ లో కచ్చితంగా చేసుకుంటాను.. ఇప్పుడైతే ఇంకా ఆ ఆలోచన లేదు. ఇంకా నాకు నేను చిన్న పిల్లాడినే అనే ఫీలింగ్…!
‘ఫైటర్’ సినిమా టైటిల్ ‘లైగర్’ గా మారింది అంటున్నారు.. నిజమేనా?
అది.. పూరిగారి ఇష్టం. ఆయన ఫైనల్ చెయ్యాలి అది..!
‘మహేష్ 27’ లో మీరు యాక్ట్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.. నిజమేనా?
అంత ముచ్చట.. లేదు నాకు(నవ్వుతూ) . ప్రస్తుతం నా సినిమాలతో నేను బిజీగా ఉన్నాను. ఆ వార్తల్లో నిజం లేదు.