Pawan Kalyan, Vijay: ఫ్యాన్స్ ట్రోలింగ్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

  • March 4, 2022 / 07:06 PM IST

స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 28 సినిమాలలో నటించగా ఆ సినిమాలలో సగం సినిమాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం. రీఎంట్రీలో పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం.

వకీల్ సాబ్ పింక్ మూవీ రీమేక్ కాగా భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు పవన్ వినోదాయ సిత్తం రీమేక్ కు ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ వరుసగా రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు పవన్ ను ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ ఈ మధ్య సాధారణం అయింది.

విజయ్ కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించగా ఆ సమయంలో పవన్ అభిమానులు విజయ్ ను ట్రోల్ చేశారు. విజయ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు తెలుగు సినిమా రీమేక్ లు కావడం గమనార్హం. ఇప్పుడు మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. అయితే పవన్ ఇప్పుడు రీమేక్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ పవన్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.

అయితే విజయ్ ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు ధీటుగా సమాధానమిస్తారు. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ సినిమాలలో కూడా నటిస్తున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమాల ద్వారానే పవర్ స్టార్ అనే బిరుదు వచ్చిందని కామెంట్లు పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే విజయ్ అభిమానులు మాత్రం పవన్ సొంత కథల్లో నటించాలని కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus