Leo Movie: విజయ్ లోకేశ్ కనగరాజ్ రేంజ్ ఇదే.. ఆ స్థాయిలో బిజినెస్ జరిగిందా?
August 16, 2023 / 07:14 PM IST
|Follow Us
విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లియో మూవీ అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బిజినెస్ విషయంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లియో మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఈ స్థాయిలో హక్కులు అమ్ముడవడం అంటే ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి.
విజయ్ లోకేశ్ కనగరాజ్ రేంజ్ ఇదేనంటూ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. విక్రమ్ సినిమా తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న లియో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం. సినిమా సినిమాకు విజయ్ రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.
వారసుడు సినిమాతో ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న విజయ్ లియో (Leo Movie) సినిమాతో అంతకు మించి రికార్డులు సృష్టించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు విజయ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. స్టార్ హీరో విజయ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.
విజయ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇతర భాషలపై విజయ్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. తెలుగులో మార్కెట్ ను పెంచుకునేలా విజయ్ అడుగులు వేస్తున్నారు. లియో తెలుగు రైట్స్ ను దిల్ రాజు కొనుగోలు చేయడం గమనార్హం.