Maharaja OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మహారాజ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
June 17, 2024 / 02:52 PM IST
|Follow Us
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహారాజ (Vijay Sethupathi) మూవీ ప్రస్తుతం థియేటర్లలో అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాలుగు వారాల తర్వాత లేదా ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కగా నిథిలన్ స్వామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో సైతం మహారాజ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతికి సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి విలన్ రోల్స్ కు సైతం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి తెలుగు సినిమాల్లో సైతం ఎక్కువగా నటించడం లేదు. మహారాజ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయగా ఆ ప్రమోషన్స్ ఈ సినిమాకు కలిసొచ్చాయి.
నిర్మాతలకు ఈ సినిమా భారీ లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహారాజ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి ఇలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆయన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.