Vijay Sethupathi: హిట్‌ కోసం మక్కళ్‌సెల్వన్‌ను దింపుతున్నాడా!

  • August 5, 2021 / 03:55 PM IST

టాలీవుడ్‌లో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్‌ హీరోల్లో… సందీప్‌ కిషన్‌ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా మచ్చుకు ఒక్క హిట్‌ కూడా అందుకోలేకపోతున్నాడు. పట్టువదలని విక్రమార్కుడు లాగా సినిమాలు మాత్రం ఆపడం లేదు. ‘సందీప్‌ కిషన్‌కి హిట్‌ వస్తే బాగుండు’ అని తెలుగు ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి చేయబోయే సినిమా కచ్చితంగా హిట్‌కొట్టాలని సందీప్‌ కృతనిశ్చయంతో ఉన్నాడనిపిస్తోంది. కారణం సినిమా కాస్టింగ్‌ ఎంపిక.

దక్షిణాదిలో మంచి డిమాండ్‌ ఉన్న నటుడు విజయ్‌ సేతుపతిని తన సినిమాలో నటించేలా సందీప్‌ కిషన్‌ ఒప్పించాడని తెలుస్తోంది. సందీప్‌ కిషన్‌తో మంచి అనుబంధం ఉన్న బాలీవుడ్ దర్శకనిర్మాతలు రాజ్ అండ్‌ డీకే త్వరలో తెలుగులో ఓ సినిమా నిర్మించబోతున్నారట. ఈ సినిమాకు భరత్‌ చౌదరి దర్శకత్వం వహిస్తారు. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని సంప్రదించారట. దానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్‌ సేతుపతితో సందీప్‌ కిషన్‌కు మంచి అనుబంధమే ఉంది.

ఈ క్రమంలోనే విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాడని సమాచారం. మరోవైపు రాజ్‌ అండ్‌ డీకే గతంలో సందీప్‌ కిషన్‌తో ‘డి ఫర్‌ దోపిడీ’ అనే సినిమా నిర్మించారు. ఆ తర్వాత ఆ దర్శక ద్వయం ఇప్పుడే టాలీవుడ్‌లోకి వస్తున్నారు. మొన్నీ మధ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో ఓటీటీలో అదరగొట్టిన విషయం తెలిసిందే.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus