Vijay Varma: వధువు కావాలని అన్న విజయ్ వర్మ.. తమన్నా ఉందిగా అంటూ కామెంట్స్!
May 15, 2023 / 08:08 PM IST
|Follow Us
విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదని చెప్పాలి అయితే తమన్నాతో ఎప్పుడైతే డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తలలో నిలిచారో అప్పటినుంచి ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. ఇలా తరచూ తనతో కలిసి కనిపించడంతో విజయవర్మ అందరి దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ వర్మ తమన్నాతో కలిసి పలుమార్లు కెమెరా కంటికి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇదే ప్రశ్న (Vijay Varma) విజయ్ వర్మను ప్రశ్నించగా ఆయన తనతో రిలేషన్ లో ఉన్నానంటూ చెప్పకనే చెప్పేశారు. ఇలా తమన్నాతో డేటింగ్ రూమర్స్ ద్వారా ఈ మధ్యకాలంలో విజయ్ వర్మ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ వర్మ నటించిన దహాద్ వెబ్ సిరీస్ మే 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్లలో భాగంగా ఇండియాలోనే నెంబర్ వన్ బ్యాచిలర్ అంటూ విజయ్ వర్మ ఫోటో పేపర్లో వేయడమే కాకుండా దాని కింద వధువు కావలెను అని రాసి ఉంది. అలాగే అబ్బాయి గురించి కొన్ని వివరాలు కూడా రాసి ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయవర్మ తల్లి ఒక్కసారిగా తల పట్టుకున్నారు. ఈ ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హ్యాపీ మదర్స్ డే అమ్మ…
క్యాంపెయిన్ బానే ఉంది కానీ వధువు కావాలనే ప్రకటన గురించి అమ్మకు ఎలా చెప్పాలి అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియోని ట్యాగ్ చేశారు. అయితే విజయ్ వర్మ పోస్ట్ కు రిప్లై ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ మేము ఆమెకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తూ తమన్నా ఉంది కదా భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.