ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ కోసం కేవలం అభిమానులే కాదు ఎంతోమంది సినిమా ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఈపాటికే సినిమా హడావుడి మొదలయ్యి ఉండేది. ఇక జక్కన్న అనుకున్న సమయానికి విడుదల చేస్తాడో లేదో తెలియదు గాని ఆ సినిమాపై వస్తున్న రూమర్స్ గాసిప్స్ అంచనాలను అమాంతంగా పెంచేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు మంచి కోసం పోరాడిన సమర యోధుల పాత్రలో నటిస్తుండడం ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం.
తారక్ కొమరం భీమ్ పాత్రలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరు అనుకోకుండా సమరానికి సై అంటే వెండితెర హీటెక్కడం కాయం. సినిమా స్టోరీ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిద్దరూ కొట్టుకుంటే కన్నీళ్లు ఆగవని క్లారిటీ ఇచ్చేశారు. గత ఏడాది నుంచి సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ ఉంటుందని అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా సినిమా రైటర్ అది నిజమానేని క్లారిటీ ఇచ్చేశారు.
ఒక హీరో విలన్ ను కొడితే కొట్టాలి అనుకుంటాం. కానీ ఇద్దరు సమానమైన స్టార్స్ పరిస్థితుల ప్రభావం వల్ల కొట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇక అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు. నాకు కూడా అలానే అనిపించింది. అది సినిమా అని తెలిసినా కూడా చూసిన తరువాత నాలో కన్నీళ్లు ఆగలేదు.. అందరికి ఆ ఎమోషనల్ ఫైట్ సీన్ కట్టిపడేస్తుందని K.విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.