విజయేంద్ర ప్రసాద్ ఆ ఒక్క కథ తప్ప.. మిగిలినవన్నీ అమ్మేస్తారట!
October 27, 2022 / 11:22 PM IST
|Follow Us
రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది అంటే అక్కడ సందడి అంతా ఆయన ఫ్యామిలీదే ఉంటుంది. అయితే వీళ్ళ కుటుంబ సభ్యుల్లో కీలకమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్పుకోవాలి.ఈయన కథతో సినిమా చేస్తున్నారు అంటే అది మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఈయన దాదాపు 35 సినిమాలకు కథ అందించారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అందుకున్నవే. ఏ కథ ఎంత వరకు సక్సెస్ అవుతుంది.
దానికి ఎంత వరకు ప్రమోషన్ చెయ్యాలి వంటి అంశాలు ఈయనకు బాగా తెలుసు. ఇలాంటి వ్యక్తి దర్శకుడిగా కూడా మారి సక్సెస్ అవ్వాలి. కానీ ఎందుకో విజయేంద్ర ప్రసాద్ సక్సెస్ కాలేదు. ఈయన 4 సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయారు. అయితే ఈయన రైటర్ గా తెలుగు సినిమాలకే కాకుండా హిందీ, తమిళ సినిమాలకు కూడా పనిచేశారు. విజయేంద్రప్రసాద్ కథలతో రూపొందిన `భజరంగీ భాయ్ జాన్` ‘మెర్సల్'(తెలుగులో అదిరింది) వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
ఇదిలా ఉండగా.. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఇంకా చాలా కథలు ఉన్నాయి. అన్నీ రాజమౌళి డైరెక్ట్ చేయడం కుదరదు.కాబట్టి.. ఆయన వద్ద ఉన్న కథలు పలువురు పెద్ద దర్శకులకు, నిర్మాణసంస్థలకూ ఇచ్చేయాలని భావిస్తున్నారట. ఇందులో `విక్రమార్కుడు 2` కూడా ఉంది.అలాగే ‘బాహుబలి’ లోని కొన్ని పాత్రల్ని తీసుకుని వాటిని లీడ్ రోల్స్ గా మార్చి తీయగలిగే కథలు కూడా ఉన్నాయట. అలాగే పవన్ కళ్యాణ్ కోసం కూడా ఓ కథ రాసుకున్నారు.
అది మాత్రం రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందించాలి అని ఆయన అనుకుంటున్నారట. అన్ని కథలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేవే. కాకపోతే వాటిని హ్యాండిల్ చేసే దర్శకులను పట్టుకోవడం కష్టం. టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ దర్శకులు ఎంతో మంది ఉన్నా.. అద్దెకు తెచ్చుకున్న కథ తీయాలి అంటే వాళ్లకు కంఫర్ట్ మిస్ అవుతుంది అని భావిస్తున్నారు.దానికంటే రీమేక్ లు, ఫ్రీమేక్ లు బెటర్ అనుకునే బ్యాచ్ ఎక్కువయ్యారు. మరి విజయేంద్ర ప్రసాద్ కథలు ఎవరికి దక్కుతాయో చూడాలి..!