Beast First Review: బీస్ట్ సినిమా ఫస్ట్ రివ్యూ & రేటింగ్ వచ్చేసింది..!

  • April 9, 2022 / 07:50 PM IST

‘మాస్టర్’ సినిమాతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ‘బీస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ముందే రివ్యూ బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలో ప్రతి సినిమాకి రిలీజ్ కి ముందే రివ్యూ ఇచ్చే క్రిటిక్ ఉమైర్ సంధు ‘బీస్ట్’ సినిమాకి కూడా రివ్యూ ఇచ్చారు.

దుబాయ్ లో సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు తాజాగా ‘బీస్ట్’ సినిమా సెన్సార్ షోని చూశారట. అనంతరం తన వ్యూస్ ను నెటిజన్లతో పంచుకున్నారు. అన్ని కోణాల్లో ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని.. ఈ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇదొక పవర్ ప్యాక్డ్ సినిమా అని.. ప్రాజెక్ట్ ను చాలా బాగా అర్ధం చేసుకొని విజయ్ నటించారని పేర్కొన్నారు. మరో మాట లేకుండా.. ‘బీస్ట్’ సినిమా విజయ్ షో అని, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని రాసుకొచ్చారు.

మొత్తంగా చెప్పాలంటే.. ఈ సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్ అని.. ప్రేక్షకులకు చాలా ఎంగేజింగ్ గా, అద్భుతంగా అనిపిస్తుందని చెప్పారు. స్క్రీన్ ప్లే మరో రేంజ్ లో ఉంటుందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాను ఇచ్చినందుకు యూనిట్ కి థాంక్స్ చెప్పారు. ఉమైర్ సంధు గతంలో చాలా సినిమాలకు ఇలానే రివ్యూలు ఇచ్చారు. అందులో కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ కేటగిరీలోకి వెళ్తుందో చూడాలి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus