రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన సర్కార్ థియేట్రికల్ రైట్స్
October 26, 2018 / 06:43 AM IST
|Follow Us
ఇలయదళపతి విజయ్‌కి తమిళంలో వీరాభిమానులున్నారు. తుపాకీ, అదిరింది సినిమాలతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. అందుకే స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తన 62వ సినిమాగా సర్కార్ చేశారు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ మూవీ టీజర్ సంచలనం సృష్టించింది. ఈ టీజర్ కేవలం పదినిముషాల్లో మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇరవైనిముషాల్లో 2 మిలియన్, 35 నిముషాల్లో మూడు మిలియన్ వ్యూస్ సాధించి ఔరా అనిపించింది. ఒక్కరోజు కూడా పూర్తికాకముందే 12 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించిన ఈ టీజర్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పుడు బాహుబలి రికార్డ్ ని సైతం తిరగరాసింది. తమిళనాడు లో ఈచిత్రం 83కోట్లకు అమ్ముడై రికార్డు నెలకొల్పింది.
ఈ మొత్తం తమిళ నాడు లో ‘బాహుబలి 2’ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన షేర్ కంటే ఎక్కువ కావడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. కలక్షన్స్ పరంగా ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో చూడాలి.