మెగా కుటుంబంలో పదిమంది హీరోలున్నారు. కానీ వారి చిత్రాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడానికి పోటీ పడుతుంటాయి. అయితే మెగా హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు తొలిప్రేమ, ఇంటిలిజెంట్ మధ్య పోటీ నెలకొంటే చిరు కల్పించుకొని ఇంటిలిజెంట్ ని ఫిబ్రవరి 9 న, తొలిప్రేమని ఫిబ్రవరి 10 రిలీజ్ అయ్యేలా చేశారు. ఈ సారి నుంచి మెగా హీరోల సినిమాల మధ్య కనీసం వారం గ్యాప్ ఉండేలా చూసుకోవాలని చిరు చెప్పారంట. కానీ మళ్ళీ క్లాష్ ఏర్పడింది. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో హీరో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ‘తేజ్’ ఐ లవ్ యు జులై 6న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. ఇక మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా విజేత జులై 6న థియేటర్లకు రానున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి కి ఈగ అద్భుతమైన విజయాన్ని అందించింది. ఆ చిత్రం జులై 6న రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే విజేతని అదే రోజు విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. కానీ అల్లుళ్ల మధ్య పోటీ మంచిది కాదని సాయి కొర్రపాటిని అడిగి లైన్ క్లియర్ చేశారు. జూలై 6న ‘తేజ్’ ఐ లవ్ యు యధావిదిగా రిలీజ్ అవుతుంది. విజేత మాత్ర జూలై 12కి వాయిదా వేశారు. “నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. సాయిధరమ్ తేజ్ సినిమా వస్తున్న తేదీకే విజేత వస్తుందా అని భయపడ్డాను. ఒకే ఇంట్లో ఉన్న హీరోల మధ్య పోటీ తప్పదా అనుకున్నాను. కానీ సాయి కొర్రపాటి అనవసర పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో పెద్ద మనసుతో విజేతను జులై 12కు పోస్ట్ పోన్ చేశారు.” అని చిరంజీవి నిన్న వేడుకలో చెప్పారు.