Vikram K Kumar: ‘థ్యాంక్యూ’ డిజాస్టర్ వెనుక కారణాలు చెప్పిన దర్శకుడు… ఏమన్నారంటే?
December 1, 2023 / 03:06 PM IST
|Follow Us
విక్రమ్ కె కుమార్ సినిమాల విషయంలో టాలీవుడ్లో ఓ మాట ఉంటుంది. అయితే అనూహ్యమైన విజయం, లేదంటూ ఊహించలేని పరాజయం పొందుతుంటాయి. ఆయన ఎంచుకున్న పాయింట్ల లెక్క అది మరీ. ఎవరూ ఊహించని, ఎవరూ చేయడానికి ముందుకురాని పాయింట్లతో సినిమాలు చేస్తుంటారాయన. ‘మనం’ లాంటి సినిమాను మనం వేరొకరి నుండి ఊహించడం కష్టం. అలాంటి వ్యక్తి ఇటీవల ‘థ్యాంక్యూ’ సినిమాతో వచ్చారు. అయితే బాక్సాఫీసు దగ్గర సినిమా ఊహించని ఫలితం ఎదుర్కొంది.
ఆ సినిమా చేసిన నాగచైతన్యతోనే విక్రమ్ కె కుమార్ ఓ వెబ్ సిరీస్ కూడా చేశారు. అదే ‘దూత’. ఈ సిరీస్ నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో విక్రమ్ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తన పాత సినిమా ‘థ్యాంక్యూ’ గురించి కూడా మాట్లాడారు. నాగచైతన్య, విక్రమ్ కుమార్‌ది ‘మనం’ లాంటి క్లాసిక్ హిట్ కాంబినేషన్. ఆ కాంబో రెండో ప్రయత్నంగా ‘థ్యాంక్యూ’ వచ్చిన విసయం తెలిసిందే. దీంతో కాస్త అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
‘థ్యాంక్యూ’ సినిమా కథ కరోనా – లాక్ డౌన్ మైండ్ సెట్ నుండి పుట్టిందట. జీవితాన్ని అందరూ గొప్పగా బతికేయాలని అనుకుంటున్నప్పుడు, బతకడానికి డబ్బు, హోదా, పలుకుబడే ప్రధాన లక్ష్యం కాదు అనే ఆలోచనా ధోరణి ఆ సమయంలో కనిపించాయట విక్రమ్‌కు. అంతేకాదు ఆ సమయంలో చాలా మంది కేవలం ఒక షార్ట్ తో నెలలు గడిపేశారు అన్న విక్రమ్… ఆ సమయంలో జీవితంలో థ్యాంక్స్ అవసం గురించి ఆలోచన వచ్చి కథ రాశాను (Vikram K Kumar) అని చెప్పారు.
జీవితం పట్ల, వ్యక్తుల పట్ల కృతజ్ఞత ఉండటం అన్నింటి కంటే గొప్ప విషయం అని ఆ సినిమాతో చెప్పాలని ఆయన అనుకునర్నారట. ఆ కోణంలోనే ‘థ్యాంక్యూ’ కథ రాశారట. అయితే ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ కాలేదని సినిమా వచ్చాక తెలుసుకున్నారట. దానికి కారణం కూడా ఆయనే చెప్పారు. సినిమా కథ రాసినప్పటి సమయానికి ఉన్న మూడ్, సినిమా వచ్చే నాటికి మారిపోయిందని అందుకే కథకు ఆదరణ దక్కలేదు అని విక్రమ్ చెప్పారు.