విక్రమ్ తో నిక్కి గల్రానీ రొమాన్స్..!

  • June 20, 2016 / 11:55 AM IST

తమిళ నటుడు విక్రమ్ ప్రభుతో నిక్కి గల్రానీ రొమాన్స్ చేయనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నూతన దర్శకుడు అశోక్ తెరకెక్కించనున్న ఈ చిత్రం జూలై 11 నుంచి సెట్స్ పైకి వెళ్లనుండగా.. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

థ్రిల్, యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కలగలసిన చిత్రమని, ఈ చిత్ర కథ కాస్త విభిన్నమైందని నిక్కి అంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నిక్కి గల్రానీ..రాఘవ లారెన్స్ సరసన మొట్ట శివ కెత్త శివ చిత్రంలో నటిస్తుండగా.. ‘వీర శివాజీ’ చిత్రంలో నటిస్తూ విక్రమ్ ప్రభు బిజీగా ఉన్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus