తెలుగులో కుదరక హిందీలో రీమేక్ చేస్తున్నారు!

  • March 15, 2018 / 11:58 AM IST

మాధవన్,, విజయ్ సేతుపతి హీరోలుగా తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రం “విక్రమ్ వేదా”. అద్భుతమైన స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నిటికీ మించి మెయిన్ లీడ్స్ గా నటించిన మాధవన్, విజయ్ సేతుపతీల కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున-రాణా లేదా వెంకటేష్-రాణా కాంబినేషన్ లో రీమేక్ చేద్దామనుకొన్నారు తమిళ దర్శకనిర్మాతలు. అందుకోసం ప్రీప్రొడక్ష వర్క్ కూడా జరిగింది. అయితే.. మన హీరోలు ఎప్పటికీ డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడమే కాక పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపకపోవడంతో దర్శకులు పుష్ప భాస్కర్ తెలుగు రీమేక్ ను పక్కనేట్టేశారు.

తాజా సమాచారం ఇప్పుడు “విక్రమ్ వేద”ను హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. వైనాట్ స్టూడియోస్, ప్లాన్ సి ఎంటర్ టైన్మెంట్స్, రిలయన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాయి. ఒరిజినల్ డైరెక్టర్స్ అయిన పుష్ప-భాస్కర్ లు హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు. మాధవన్ పాత్రలో రాజ్ కుమార్ రావ్ నటించనుండగా.. విజయ్ సేతుపతి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధికీ కనిపించనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ బాలీవుడ్ లో సంచలనం సృష్టించడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus