Vikram Vedha: విక్రమ్ వేదతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సక్సెస్ దక్కుతుందా?
September 16, 2022 / 04:52 PM IST
|Follow Us
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో విక్రమ్ వేద ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా అదే టైటిల్ లో బాలీవుడ్ లో రీమేక్ కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ బాలీవుడ్ మూవీ 100కు పైగా దేశాలలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ఆశలు పెట్టుకుంది.
ఆఫ్రికాలోని 27 దేశాలలో, యూరప్ లోని 22 దేశాలలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా పట్టు లేని దేశాలలో కూడా విక్రమ్ వేద రిలీజ్ కానుందని బోగట్టా. గతంలో ఏ సినిమా విడుదల కాని స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా సక్సెస్ సాధిస్తే మాత్రమే ఈ సినిమాకు ఈ స్థాయిలో రిలీజ్ కావడం ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ వేద రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పుష్కర్ గాయత్రి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్ వేద హిందీలో రాధికా ఆప్టే, యోగిత బిహానీ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజైన విక్రమ్ వేద ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. విక్రమ్ వేద ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు బాయ్ కాట్ ట్రెండింగ్ ద్వారా వార్తల్లో నిలిచాయి. ఈ సినిమాకు అలాంటి సమస్యలు లేకపోవడం గమనార్హం. విక్రమ్ వేద సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.