Vinaro Bhagyamu Vishnu Katha Review in Telugu: వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రివ్యూ & రేటింగ్!
February 20, 2023 / 10:53 AM IST
|Follow Us
Cast & Crew
కిరణ్ అబ్బవరం (Hero)
కశ్మీరా (Heroine)
మురళీశర్మ తదితరులు.. (Cast)
మురళి కిషోర్ అబ్బూరు (Director)
బన్నీ వాస్ (Producer)
చైతన్ భరద్వాజ్ (Music)
డానియల్ విశ్వాస్ (Cinematography)
“సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని” వంటి చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించగా విడుదలైన తాజా చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ”. మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి కిరణ్ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టగలిగాడో లేదో చూద్దాం..!!
కథ: విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతిలో పుట్టి పెరిగిన కుర్రాడు. తన చుట్టూ ఉన్న మనుషులకి సహాయం చేస్తూ.. వాళ్ళ ఆనందంలో తన సంతోషాన్ని చూసుకుంటుంటాడు. ఆ క్రమంలో తన యూట్యూబ్ చానల్ కంటెంట్ కోసం “నెంబర్ నైబర్” అనే థాట్ ద్వారా పరిచయమవుతుంది దర్శన (కశ్మీరా).
ఈ ఇద్దరి ప్రేమకథలో, వాళ్ళకి తెలియకుండా ఒక పొలిటీషియన్, అతని అనుచరుడు, ఒక పోలీస్ ఆఫీసర్ దూరతారు.
అసలు విష్ణు కథలోకి వీళ్ళందరూ వచ్చారు? అందరికీ మంచి చేసే విష్ణు చివరికి ఏం జరిగింది? అనేది “వినరో భాగ్యము విష్ణు కథ” చిత్రం.
నటీనటుల పనితీరు: కిరణ్ అబ్బవరం చూడ్డానికి స్టైలిష్ గా ఉన్నాడు. నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా తన పరిధిని పెంచుకున్నాడు. కానీ.. డైలాగ్ డెలివరీ విషయంలో నీరసంగా వినిపిస్తాడు. డైలాగ్ ను సాగదీస్తూ నీరసంగా పలకడం స్టైల్ అనుకుంటే పొరపాటే అని అర్ధం చేసుకోవాలి కిరణ్.
కశ్మీరా అందంగా కనిపించడమే కాక అభినయంతోనూ ఆకట్టుకోవడానికి కూడా ప్రయత్నించింది. అయితే.. ఆమె క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేకపోవడం, ఎండింగ్ కూడా సరైన విధంగా ప్లాన్ చేయకపోవడంతో.. ఆమె పాత్ర చాలా అబ్రప్ట్ గా ముగుస్తుంది.
మురళీ శర్మ చేసిన రీల్స్ కామెడీ టీజర్స్ వరకు మాత్రమే పండింది. సినిమాలో అంతగా ఎలివేట్ అవ్వలేదు. అయితే.. అతడి పాత్రకు క్లైమాక్స్ & ప్రీ-క్లైమాక్స్ లో పెట్టిన ట్విస్ట్ మాత్రం బాగా పేలింది.
అలాగే కన్నడ నటుడు శరత్ పాత్రతో కథను నడిపించిన విధానం బాగుంది. ప్రవీణ్, పమ్మి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: చైతన్ భరద్వాజ్ సంగీతం & బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. చాలా చిన్నపాటి సందర్భాలను కూడా చక్కగా ఎలివేట్ చేశాడు చైతన్. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమా క్వాలిటీకి తగ్గట్లుగా లేదు. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ మాత్రం GA2 పిక్చర్స్ బ్యానర్ వేల్యూను ఎలివేట్ చేశాయి.
దర్శకుడు మురళి కిషోర్ ఒక సాధారణ కథను, అసాధారణమైన కథనంతో నడిపించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుద్దామని చేసిన ప్రయత్నం కొంతమేరకు ఫలించింది. అయితే.. కథ ద్వారా ట్విస్టులను ఎలివేట్ చేయకుండా.. ట్విస్టులను ఎలివేట్ చేయడం కోసమే కొన్ని సన్నివేశాలను కథలో ఇరికించడం మైనస్ గా మారింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను ట్విస్టుల కోసం మెలితిప్పిన విధానం వల్ల, సదరు ట్విస్టులు పూర్తిస్థాయిలో పేలలేదు. అలాగే.. మనిషి, మంచితనం అంటూ రాసుకున్న డైలాగ్స్ మరీ బోధనల్లా ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది కానీ.. ఇంకాస్త బెటర్ గా ఎలివేట్ చేసి ఉండొచ్చు. అలాగే.. లాజికల్ గా చాలా లూప్ హోల్స్ వదిలేశాడు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ విష్ణు కథ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచేది.
విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం కచ్చితంగా అలరించే చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ”. హీరో కాస్త బద్ధకంగా చెప్పే డైలాగులు, బోధనల్లాంటి నీతిసూక్తులు, ఏమైపోతుందో తెలియని హీరోయిన్ క్యారెక్టర్ ను పక్కన పెడితే.. ఈ చిత్రాన్ని ఓ మోస్తరుగా ఆస్వాదించగలరు.