చడీచప్పుడు లేకుండా పవన్‌ ఆ సినిమా స్టార్ట్‌ చేస్తున్నాడా?

  • January 23, 2023 / 05:39 PM IST

పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ముహూర్తం జరపడమే టీమ్‌ చేతుల్లో ఉంది.. షూటింగ్‌ జరుపుకోవడం, విడుదలవ్వడం మాత్రం లేదు. ఏంటీ హార్స్‌ కామెంట్‌ అనుకుంటున్నారా? ఇటీవల కాలంలో పవన్‌ కల్యాణ్‌ సినిమాలు చూస్తే ఈ కామెంట్‌ కచ్చితంగా నిజం అనిపించకమానదు. కారణం సినిమాలు అనౌన్స్‌ అవుతున్నాయి కానీ.. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ ఉండటం లేదు. అప్పటికే అనౌన్స్‌ అయిన సినిమాల సంగతి తేలడం లేదు కానీ.. కొత్త సినిమా అనౌన్స్‌ అవుతున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌టేక్‌ చేసి కొత్త ప్రాజెక్ట్‌లే ముందుకొస్తున్నాయి కూడా.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? మొన్నీ మధ్య రెండు పవన్‌ సినిమా అనౌన్స్‌ అయ్యాయి. అందులో ఒకటి షూటింగ్‌కి ముహూర్తం కూడా జరుపుకుంది. అయితే ఈ రెండు సినిమాలను మరో సినిమా ఓవర్‌ టేక్‌ చేస్తుంది అనే వార్తలు రావడమే ఈ చర్చకు కారణం. ‘వినోదాయ చిత్తాం’ గుర్తందా? ఆ మధ్య చాలా రోజుల పాటు పవన్‌ ఫ్యాన్స్‌ను కలవరపెట్టిన సినిమా. అవును గుర్తుంది.. ఆ సినిమా ఆగిపోయినట్లేగా అంటారా? ఆగండాగండి అయితే..

ఎందుకంటే ఆ సినిమా ఆగిపోలేదట. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అంటున్నారు. అవును మీరు చదివింది కరెక్టే… ఆగిపోయింది అనుకుంటున్న ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ పనులు వచ్చే నెలలో ప్రారంభం అవుతాయి అంటున్నారు. చడీచప్పుడు లేకుండా బ్యాక్‌ఎండ్‌ పనులు మొత్తం పూర్తి చేస్తున్నారట త్రివిక్రమ్‌. తమిళంలో సముద్ర ఖని దర్శకత్వంలో ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఆయన డైరెక్ట్‌ చేస్తారు. దానికి రచనా సహకారం తెలుగులో త్రివిక్రమ్‌ అందిస్తారని అప్పుడే వార్తలొచ్చాయి.

అయితే సుజీత్‌ – డీవీవీ దానయ్య సినిమా, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పనులు మొదలుపెడతారు అని ఇటీవల వరకు వార్తలొచ్చాయి. ఎలాగూ ‘హరి హర వీరమల్లు’ షూట్‌ అవుతోంది. దీంతో ‘వినోదాయ చిత్తాం’ ఇక లేనట్లే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ సినిమాకు అతి తక్కువ డేట్స్‌తో పూర్తి చేసేలా పవన్‌ – త్రివిక్రమ్‌ ప్లాన్స్‌ వేశారట. రెండు, మూడు వారాల డేట్స్‌తో ఫిబ్రవరిలో సినిమాలో పవన్‌ పార్ట్‌ షూటింగ్‌ పనులు పూర్తి చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులు చేసుకుంటారట.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus