అనుష్క, విరాట్ ల మధ్య ప్రేమ మళ్లీ చిగురిస్తొంది..?!
May 4, 2016 / 11:22 AM IST
|Follow Us
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీలు ఇద్దరు కలిసి పోయారా..? మూడు నెలల క్రితం వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలు తొలగిపోయాయా? ట్విట్టర్ లో కోహ్లీ మళ్ళీ అనుష్కను ఫాలో అవుతున్నాడా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
మూడు నెలల క్రితం వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలు సమసిపోయాయని, అనుష్క-విరాట్ లు సమయం చిక్కినప్పుడల్లా తిరిగి వారి స్నేహితుల ఇళ్లకు జంటగా వెళుతున్నారని అంటున్నారు. మే 1 న అనుష్క పుట్టిన రోజు కావటంతో.. ప్రస్తుత ఐపీయల్ సీజన్ వల్ల కోహ్లీ ఆమెను కలుసుకోలేక పోయాడు.
అయితేనేం ఓ భారీ ఫ్లవర్ బొకెను సుల్తాన్ సెట్స్ లో ఉన్న అనుష్కకు గిఫ్ట్ గా పంపాడట. అంతేకాకుండా ట్విట్టర్ లో కోహ్లీ తిరిగి ఆమెను ఫాలో అవుతున్నాడు. సో, ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే.. వీరిద్దమారి మధ్య ప్రేమ మళ్లీ చిగురించిందేమో? అని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి!