సీటా పాప… విత్ కోహ్లీ : మహేష్ బాబు

  • January 25, 2019 / 10:12 AM IST

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ… మైదానంలో ఎరేంజ్లో వీరబాదుడు బాదుతాడో … బయట అంత సాఫ్ట్ గా నేచర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే కోహ్లీకి మరీ ఇష్టం. చుట్టూ పిల్లలుంటే చాలు… ఇక కోహ్లీకి ఏమీ గుర్తుండదట. గతంలో ధోనీ కూతురు జీవాతో ఎలా ఆడుకున్నాడో అందరూ చూసే ఉంటారు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ‘పిల్లి వస్తుంది’… అంటూ ధోనీ కూతురిని ఎంత ఆటపట్టించాడో.. అందరికీ తెలిసిందే.

తాజాగా మరోసారి స్టార్ డాటర్ తో ఆడుకుంటూ కోహ్లీ చిన్నపిల్లాడైపోయాడు. ఆ స్టార్ డాటర్ ఎవరో కాదు మన… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సీతారనే. కోహ్లీ సీతారాతో ఆడుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇన్ స్టా గ్రామ్ లో కోహ్లీ, అనుష్క శర్మలు సీతారతో ఆడుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేసిన మహేష్… ‘సీటా పాప విత్ కోహ్లీ అని ట్యాగ్ చేయడం విశేషం. ఫ్యామిలీతో ఎప్పుడూ.. టూర్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు.. మహేష్. సంవత్సరానికి 6 సార్లు ఫ్యామిలీతో విదేశీ టూర్లకు వెళ్తానని మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మొత్తానికి ఒక పక్క ప్రొఫెషనల్ లైఫ్.. మరో పక్క పర్సనల్ లైఫ్ ను బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు మహేష్..!

→  మహేష్ ఇచ్చిన మెసేజ్ కు ప్రశంసల వెల్లువ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus