Rana, Sai Pallavi: ఘనంగా ఆత్మీయ వేడుకను ఏర్పాటు చేయనున్న విరాట పర్వం మేకర్స్!

  • June 10, 2022 / 06:08 PM IST

డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. 1990 సంవత్సరంలో నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం కర్నూలులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

అయితే అకాల వర్షం కారణంగా ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో పూర్తికాకపోవడంతో చిత్ర బృందం మరోసారి ఆత్మీయ వేడుకతో అభిమానుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే జూన్ 12వ తేదీ వరంగల్ వేదికగా చిత్రబృందం ఆత్మీయ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. జూన్ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

ఇకపోతే ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో రానా రవన్న పాత్రలో నటించగా సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో నవీన్ చంద్ర ప్రియమణి వంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

గత కొన్నిరోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి.ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం రంగంలోకి దిగి పెద్దఎత్తున ప్రమోషన్ నిర్వహించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus