Virata Parvam Trailer: ‘విరాట పర్వం’ ట్రైలర్.. ద్వారా ఆ హింట్ ఇచ్చిన మేకర్స్..!

  • June 6, 2022 / 12:17 PM IST

రానా, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం క్రితమే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న ట్రైలర్ ను కూడా చూపించారు.

గతేడాది విడుదలైన టీజర్.. అంతంత మాత్రమే హైప్ క్రియేట్ చేసింది. కానీ ట్రైలర్ మాత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది అంటే చెప్పాలి. ఈ ట్రైలర్ లో డైలాగ్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. నక్సలిజం, అణచివేత, పోలీసుల దౌర్జన్యం .. వాటి మధ్య చిగురించిన ప్రేమ.. భావోద్వేగాలు.. అబ్బో ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది. అయితే ఈ ట్రైలర్లో ప్రధానంగా హైలెట్ అయ్యింది సాయి పల్లవి అనే చెప్పాలి. ఆమె ఈ చిత్రంలో చాలా సహజంగా నటించినట్టు స్పష్టమవుతుంది.

అంతేకాదు హీరో రానా పాత్రకి మించి సాయి పల్లవి పాత్రకి ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. సాయి పల్లవి కూడా తన పాత్రలో బలం లేకపోతే సినిమాని ఓకే చేయదు. ‘విరాట పర్వం’ లో ఆమె పాత్ర కూడా అంత బలమైనది అని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఆమెతో పాటు ఈ చిత్రంలో మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ట్రైలర్లో ఆమె కూడా ఒక షాట్లో కనిపించింది. ఇక సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఎంత మంది పెర్ఫార్మలు ఉన్నా సాయి పల్లవి డామినేషన్ మాత్రం బలంగానే ఉండేలా ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!


విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus