విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నది ఆ అమ్మాయినే..?

  • December 31, 2018 / 10:55 AM IST

కోలీవుడ్ నటుడు విశాల్ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు. విశాల్ కు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక విశాల్ కూడా ఓ తెలుగమ్మాయినే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూతురైన అనీషాతో విశాల్ కి త్వరలోనే నిశ్చితార్ధం జరగబోతుందని విశాల్ తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా విశాల్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. విశాల్,వరలక్ష్మి మాత్రం.. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని చెప్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ క్రమంలో విశాల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనుండడంతో ఆ పుకార్లకు బ్రేక్స్ పడినట్టయ్యింది. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తవ్వగానే అందులో మొదటి పెళ్ళి నేనే చేసుకుంటానని విశాల్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ నాటికి బిల్డింగ్ నిర్మాణం పూర్తి కానుందట. దీంతో విశాల్ ఇంట పెళ్లి భాజాలు మోగడం ఖాయమని తేలిపోయింది. విశాల్, అనీషాల నిశ్చితార్ధం వేడుక హైదరబాద్ లోని ప్రముఖ హోటల్ లో జరగనుందని సమాచారం.ఇక ఈ వేడుకకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ ‘అయోగ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది తెలుగులో జూ.ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రానికి రీమేక్. దీనితో పాటు సుందర్ సి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus