Vishal: సంక్రాంతి భరిలో మరో తమిళ్ హీరో

  • January 4, 2022 / 12:06 PM IST

2022 సంక్రాంతికి తప్పకుండా పెద్ద సినిమాలతో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ ట్రాక్ లోకి వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఓమిక్రాన్ వెరియెంట్ దెబ్బకు RRR సినిమా వాయిదా పడడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రాధేశ్యామ్ రావడం కూడా అనుమనంగానే ఉంది. అయితే లోకల్ సినిమాలకు మాత్రం ఒక విధంగా పెద్ద సినిమాలు వాయిదా పడటం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. RRR లాంటి పెద్ద సినిమా వాయిదా పడటంతో చిన్న సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సంక్రాంతి విడుదలకు సిద్ధమయ్యాయి.

అయితే ఈ క్రమంలో కొన్ని మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అంతేకాకుండా తమిళ హీరోలు కూడా తెలుగులో అనువాదం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికి అందరికంటే ముందుగానే అజిత్ వాలిమై సినిమా బలం అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇక విశాల్ కూడా తన తదుపరి సినిమా సామాన్యుడు ని భారీ స్థాయిలో తెలుగులో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. గత కొంతకాలంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఫెయిల్యూర్స్ చూస్తున్న విశాల్ ఎలాగైనా బాక్సాఫీస్ మార్కెట్ ను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు.

ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో విశాల్ సినిమాలకు ఒకప్పుడు మంచి మార్కెట్ అయితే ఉండేది. ఇక్కడ మీడియం రేంజ్ హీరోల తరహాలోనే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇటీవల కాలంలో అతను చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసగా మిగిలిపోతున్నాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. సామాన్యుడు సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు సమాచారం. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus