Bigg Boss 5 Telugu: కన్ఫూజన్ లో హౌస్ మేట్స్ ఉన్నారా..!
September 17, 2021 / 10:17 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో పంతం నీదా నాదా సై అనే టాస్క్ లో ఈగల్స్ టీమ్ విజేతలుగా నిలిచింది. టీమ్ కెప్టెన్ అయిన్ శ్రీరామచంద్ర ని నలుగురు టీమ్ మెంబర్స్ ని కెప్టెన్సీ కంటెడంర్స్ గా ఎంచుకోమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో టీమ్ మొత్తం చర్చించిన తర్వాత నలుగురుని ఎంపిక చేశాడు టీమ్ లీడర్ శ్రీరామ్. ఇక్కడ సిరి మళ్లీ తను పోటీ చేస్తానని ఆసక్తి ఉందని చెప్పింది. షణ్ముక్ ని అడిగితే నేను 50-50 ఛాన్సెస్ ఎవరైనా లేకపోతే నేను ఉంటాను లేదంటే నేను డ్రాప్ అవుతాను అన్నాడు. లోబోని లెక్కలోకి తీస్కోలేదు. ప్రియ కెప్టెన్ పోటీదారులు కాలేదు కాబట్టి మిగిలిని నలుగురు టీమ్ సభ్యుల పేర్లు చెప్పాడు శ్రీరామ్. ఇందులో విశ్వ, ప్రియాంక సింగ్ , అనీమాస్టర్, హమీదలు ఉన్నారు.
కొడితే కొట్టాలిరా.. కొబ్టరికాయ కొట్టాలి అనే టాస్క్ తో ఇంటిసభ్యుల అందరి సహకారంతో ఇక్కడ కెప్టెన్ ని ఎంచుకోమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. కొబ్బరికాయలని హౌస్ మేట్స్ కొట్టి ఆ కొబ్బరినీళ్లతో కెప్టెన్సీ పోటీదారుల ముందున్న బీకర్ ని నింపాలి. అలా ఎవరి బీకర్ అయితే ముందుగా నిండుతుందో వారు గెలిచినట్లు. ఇక్కడ హౌస్ మేట్స్ వాళ్లకి నచ్చిన కెప్టెన్సీ పోటీదారుని గెలిపించుకోవచ్చు. దీన్నిచాలా కూల్ గా హ్యాపీగా ఫినిష్ చేశారు హౌస్ మేట్స్. ఎక్కువమంది విశ్వకే సపోర్ట్ చేశారు. శ్వేత అనీమాస్టర్ కి, లోబో ప్రియాంకకి, కాజల్ – సన్నీ హమీదకి సపోర్ట్ చేశారు. దీంతో విశ్వ బీకర్ ముందుగా నిండిపోయింది. అందుకే విశ్వ కెప్టెన్ అయ్యాడు.
ఇక్కడే హౌస్ మేట్స్ మద్య కన్ఫూజన్ ఏర్పడింది. కెప్టెన్ కి సపోర్ట్ చేసేవాళ్లని డిస్టర్ప్ చేయచ్చా లేదా అనేది టాస్క్ పేపర్లో లోదని శ్రీరామ్ అన్నాడు. ఉమాదేవి అన్నీ బిగ్ బాస్ చెప్పడు కదా.. మనం చేస్కోవాల్సిందే అంటూ మాట్లాడింది. కాజల్ కూడా నేను ముందే చెప్పాను మీరు వినలేదు ఉంటూ మాట్లాడింది. ఏది ఏమైనా ఇంట్లో రెండోవారం కెప్టెన్ గా విశ్వ ఎంపిక అయ్యాడు.