Bigg Boss 5 Telugu: విశ్వ తన మొదటి ప్రేమ గురించి ఏం చెప్పాడంటే..!

  • September 24, 2021 / 12:10 PM IST

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్ వాళ్లు తమ మరపురాని తొలిప్రేమల గురించి ఆడియన్స్ తో పంచుకున్నారు. ఇందులో విశ్వ తన లవర్ అయిన సుమలత గురించి చెప్పాడు. విశ్వ తన లవ్ గురించి మట్లాడుతూ.. “తను 5వ తరగతి 6వ తరగతి చదివేటపుడు మా చిన్నతాతయ్య వాళ్ల ఇంటికి వచ్చేది. ఏదో తను వచ్చేటపుడు ఎంతో ఫీలింగ్ వచ్చేది. ఆమె నాకు వరుస వేరే అవుతుంది అని తెలిసింది. భార్య వరస కాదని తెలిసింది.

కానీ, నేను వెంటపడేవాడిని చాలారోజులు అలా వెంటపడేవాడ్ని. తర్వాత అక్కడ్నుంచీ మేము షిఫ్ట్ అయిపోయాం. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే తను చనిపోయిందని చెప్పారు. ఆమెకి ఒక పాప కూడా ఉంది. ఆతర్వాత దేవుడు నాకు ఇచ్చాడు..శ్రధ్ద నా లైఫ్ లోకి వచ్చింది. పెళ్లి అయిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలని చూశాను. మా అమ్మ నాకు ధైర్యం అయితే, నాభార్య శ్రద్ధ నాకు బలం అయ్యింది. థ్యాంక్యూ సోమచ్ శ్రధ్ద నా ప్రతి చర్యలో నువ్వు ఉన్నావ్.

నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను బ్రతికున్నన్ని రోజులు నీకు అమ్మకి రుణపడి ఉంటాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు విశ్వ. అంతేకాదు, చాలాసేపు ఎమోషనల్ అయిన విశ్వ బెలూన్ కూడా పైకి వేస్తూ మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామ్ అంటూ వాళ్ల భార్యకి సందేశం పంపాడు. అక్కడ బెలూన్ పైకి వెళ్లడం లేదు అంటూ కాస్త ఫన్ చేశాడు. అదీ మేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus