వరుణ్ భార్య వితిక.. ‘బిగ్ బాస్’ చేసిన కామెంట్స్..!
October 23, 2019 / 05:21 PM IST
|Follow Us
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ మరో 10 రోజుల్లో ముగుస్తుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాని పై ఆసక్తి నెలకొంది.ఎందుకంటే.. ఫైనల్స్ కు వెళ్ళే టాప్ 5 ఎవరనేది ఈ వారం ఎలిమినేషన్ తో తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా గతవారం.. హౌస్ నుండీ ఎలిమినేట్ అయిన వరుణ్ సందేశ్ భార్య వితిక.. ‘బిగ్ బాస్’ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వితిక తన ఫేస్బుక్ ద్వారా స్పందిస్తూ…” ‘బిగ్ బాస్’ హౌస్ లో నా జర్నీ ఎంతో అందంగా సాగింది. నేనెంతో మంది స్నేహితులను తయారు చేసుకున్నాను. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండి పోతాయి. హౌస్ నుంచి బయటకు వచ్చినా… నా మనసు మాత్రం వరుణ్ తోనే ఉండిపోయింది. నేనిప్పుడు హౌస్ ను బాగా మిస్ అవుతున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి అభిమానికి, హౌస్ లోని పోటీదారులందరికీ థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చింది.