Vivaham: ‘వివాహం’ ఇప్పట్లో రిలీజ్ అవుతుందా..?

  • January 4, 2023 / 12:49 AM IST

ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా కలుపుకుంటే మొత్తం ఆరు సినిమాలు ఫైనల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’, రాహుల్ విజయ్ నటించిన ‘వివాహం’ అనే చిన్న సినిమాలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచారు. ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు సంబంధించి భారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

ఈ పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు పెద్దగా నోటీస్ అవ్వడం లేదు. ‘కళ్యాణం కమనీయం’ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి వారం దాటేసింది. పోస్టర్స్, సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమాపై సరైన బజ్ ను తీసుకురాలేకపోయారు. ఇక సంక్రాంతి రేసులో ‘వివాహం’ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందట.

ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. తక్కువ బడ్జెట్ లో సినిమాను నిర్మించారు. సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు యూవీ నిర్మించిన మీడియం రేంజ్ సినిమా కూడా ఉండటంతో ‘వివాహం’ సినిమాకి థియేటర్లు దొరకడం లేదు. అందుకే సైలెంట్ గా నిర్మాత తమ సినిమాను జనవరి 26కి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది.

అయితే జనవరి 26న కూడా తెలుగులో గట్టి పోటీనే ఉండబోతుంది. జనవరి 25న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, 26న సుధీర్ బాబు ‘హంట్’, సితార సంస్థ ‘బుట్టబొమ్మ’ రిలీజ్ కానున్నాయి. అలా చూసుకుంటే ‘వివాహం’ సినిమాకి అప్పుడు కూడా పోటీ తప్పదు. మరి సినిమాను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?<

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus