చిరు- వినాయక్ ల సడెన్ మీటింగ్.. రెండు రోజులు ఆ సినిమా గురించే చర్చ..!
September 5, 2020 / 01:58 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వి.వి.వినాయక్ ల సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరుకి దర్శకుడు వినాయక్ పై ఉన్నంత నమ్మకం మరే దర్శకుడిపైనా ఉండదు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. చిరు రీ ఎంట్రీ చిత్రాన్ని కూడా వినాయక్ చేతిలోనే పెట్టారంటే ఆ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరూ సడన్ గా బెంగుళూర్ లో మీట్ అవ్వడం పై అందరిలోనూ ఆసక్తినెలకొంది. రెండు రోజుల పైనే వీళ్ళ మీటింగ్ జరిగిందట.
అయితే అది ‘లూసిఫర్’ రీమేక్ కోసమే అన్నది ఫిలింనగర్ టాక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి చరణ్ రైట్స్ కొనుక్కుని పెట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ రీమేక్ ను తెరకెక్కిస్తాడు అంటూ చిరు చెప్పుకొచ్చాడు. కానీ సుజీత్ రెడీ చేసిన స్క్రిప్ట్ చిరుకి నచ్చకపోవడంతో.. అతన్ని తప్పించారు. ఈ నేపథ్యంలో ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతల్ని కూడా వినాయక్ కే అప్పగించారు చిరు.
స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసిన వినాయక్.. బెంగుళూర్ లో ఉన్న చిరుని కలిసి వినిపించడానికి వెళ్లారట.అందులో క్కూడా చిరు ఛేంజెస్ చెప్పడంతో..వినాయక్ రెండు రోజులు అక్కడే ఉండి .. ఫైనల్ వెర్షన్ ను రెడీ చేసి .. చిరుకి వినిపించి ఓకే చేయించుకున్నారని సమాచారం. 2021 సమ్మర్ నుండీ ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎన్.వి. ప్రసాద్ తో కలిసి రాంచరణ్ ఈ రీమేక్ ను నిర్మించబోతున్నట్టు సమాచారం.