‘అయ్యప్పనుమ్ కొషియమ్’ తెలుగు రీమేక్ కోసం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ పని చేయనున్నాడు… కాదు కాదు పని చేసేశాడు. అయితే దర్శకుడిగాను కాదు, పర్యవేక్షకుడిగానూ కాదు. అతిథి పాత్రలో. అవును పవన్ – రానా సినిమాలో వి.వి.వినాయక్ ఓ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇటీవల అతనిపై సన్నివేశాల చిత్రీకరణ కూడా అయిపోయిందట. సినిమాలో కీలక పాత్రకు వినాయక్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావించడంతో, నో చెప్పకుండా వినాయక్ నటించారని తెలుస్తోంది. పవన్ – రానా సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
అల్యూమినియం ఫాక్టరీలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. అందలోనే వినాయక్ పై సీన్స్ తీశారని తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్‌తో వినాయక్ స్క్రీన్ షేరింగ్ ఉండదట. అంటే ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించరు. వినాయక్ వెండితెరపై కనిపించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెం 150’ సినిమాల్లో కనిపించాడు. అయితే తొలిసారి వేరే దర్శకుడి సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి పూర్తి స్థాయి నటుడిగా మారేందుకు వినాయక్ ఓ సినిమా ఓకే చేశాడు కూడా.
‘శీనయ్య’ పేరుతో తెరకెక్కాల్సిన ఆ సినిమా కోసం జిమ్‌కి వెళ్లి బాడీని ఫిట్ చేసే పనిలో కూడా దిగాడు. అయితే స్క్రిప్ట్ విషయంలో తేడాలు వచ్చి, ఆ సినిమా ఆగిపోయింది. మరోవైపు పవన్ – వినాయక్ కాంబోలో సినిమా వస్తే బాగుండు అని అభిమానులు చాలా రోజులుగా అనుకుంటున్నారు. అది ఈ రకంగా నెరవేరబోతోంది. అయితే ఇద్దరూ ఓ సీన్‌లో ఉండకపోవడం ఒక్కటే లోటు.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?