ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య బాబుని ఓ బ్రాండ్ గా చెప్పుకోవాలి. ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలతో ఆయన ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశారు. ఆ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. దీంతో అటు తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’ అనే మరో ఫ్యాక్షన్ మూవీ చేశాడు బాలయ్య. అప్పటికే ఎన్టీఆర్ తో ‘ఆది’ అనే ఫ్యాక్షన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వి.వి.వినాయక్ దర్శకుడు. కాబట్టి సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి.
కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ బాలయ్య అభిమానులకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం. ఆయన అభిమానులకు అనే కాదు చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి అండర్రేటెడ్ అన్న వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా ప్లాప్ అవ్వలేదు. అలా అని హిట్ అవ్వలేదు. యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా అని అంతా అంటుంటారు. ‘చెన్నకేశవరెడ్డి’ లో కొన్ని కల్ట్ అనిపించే మాస్ సన్నివేశాలు ఉంటాయి.
చాలా కాలం తర్వాత ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు దర్శకుడు వినాయక్. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో వినాయక్ మాట్లాడుతూ.. ‘ బాలకృష్ణ గారిలో ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే.. చాలా మంది పంక్చువాలిటీ అని చెబుతుంటారు. కానీ ఒక డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్.. అని నేను చెబుతాను. చాలా మంది అభిమానులకు ‘చెన్నకేశవరెడ్డి’ బాగా నచ్చిన సినిమా.
ఈ కథలో ఫాదర్ అండ్ సన్ అనే డబుల్ రోల్ కాన్సెప్ట్ విషయంలో.. ఫాదర్ ని ఎంత డైనమిక్ గా చూపించాలి అనేదానిపై నాకు పిచ్చి ఎక్కువైపోయి కథ పై ఫోకస్ సరిగ్గా పెట్టలేకపోయాను అని అనుకుంటున్నాను. జయాపజయాలు దైవాధీనం, అది మనం పట్టించుకోకూడదు..బెస్ట్ వర్క్ ఇచ్చామా లేదా అంటూ బాలయ్య ధైర్యం చెప్పారు నాకు’ అంటూ వినాయక్ చెప్పుకొచ్చాడు. ప్రోమో బాగుంది… ఫుల్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. మీరు కూడా ఓ లుక్కేయండి :
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?