కథ, సన్నివేశాల మార్పు కోసం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట

  • January 2, 2020 / 11:23 AM IST

“అఖిల్, ఇంటెలిజంట్” లాంటి డిజాస్టర్ సినిమాల తర్వాత దర్శకుడిగా వినాయక్ పెద్ద బ్రేక్ తీసుకోవాల్సి రావడం అండరికీ తెలిసిందే. సడన్ గా దిల్ రాజు తిరుపతిలో “వినాయక్ హీరోగా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా” అని ప్రకటించేసరికి దాదాపు ప్రతి తెలుగు ప్రేక్షకుడు షాక్ అయ్యాడు. అందుకు తగ్గట్లే వినాయక్ సన్నబడడం.. కొత్త విగ్గుతో ఫోటోలు రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది. కొన్నాళ్ళ విరామం అనంతరం “శీనయ్య” సినిమా మొదలైంది.

సీతయ్య సినిమాలో హరికృష్ణను తలపించిన వినాయక్ స్టిల్స్ చూసి కొందరు ఆశ్చర్యపోతే.. కొందరు షాక్ అయ్యారు. మొత్తానికి హీరోగా కొత్త కెరీర్ స్టార్ట్ చేశాడులే అనుకుంటే.. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఇప్పటివరకూ షూట్ చేసిన ఫుటేజ్ చూసిన దిల్ రాజు.. ఔట్ పుట్ బాగోలేదని, మళ్ళీ సీన్స్ మార్చి షూట్ చేయమని చెప్పాడట. సొ, ప్రస్తుతం రైటర్ & డైరెక్టర్స్ టీం ఆ సినిమాకి మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు. సో, వినాయక్ ను హీరోగా తెరపై చూడడానికి ఇంకాస్త సమయం పడుతుండన్నమాట.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus