Waltair Veerayya: ‘వాల్తేర్ వీరయ్య’ హిందీ రిలీజ్ కు కారణమిదే!
December 31, 2022 / 11:44 AM IST
|Follow Us
సౌత్ నుంచి హిందీలో డబ్బింగ్ అయ్యే సినిమాలకు ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లకు వెళ్లి మరీ డబ్బింగ్ సినిమాలను చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘రాధేశ్యామ్’, ‘పుష్ప’ సినిమాల కోసం నార్త్ ఆడియన్స్ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ సినిమా కూడా హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఏదైనా కాస్త స్పెషల్ ఉన్న సినిమాలు మాత్రమే అక్కడ వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
అది కూడా జనవరి 13నే చేయాలనుకోవడం రిస్క్ అనిపిస్తుంది. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయట. ముందుగా ఆ సీజన్ లో బాలీవుడ్ లో సరైన సినిమా ఏదీ రిలీజ్ కావడం లేదు. అర్జున్ కపూర్ నటించిన ఓ సినిమా మాత్రం రిలీజ్ కానుంది. అందుకే ‘వాల్తేర్ వీరయ్య’ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసుకోగలిగితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యనే ‘గాడ్ ఫాదర్’ సినిమా వల్ల చిరంజీవి రీఎంట్రీ మీద అక్కడి ప్రేక్షకులకు అవగాహన వచ్చింది.
సల్మాన్ ఉన్నాడనో లేక మరొక కారణమో ఏదైతేనేం చిరంజీవి కూడా సీనియర్ స్టార్ హీరో అనే గుర్తింపు అయితే ఉంది. పైగా సినిమాలో రవితేజ ఉన్నారు. తెలుగులో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సరైన క్వాలిటీతో డబ్బింగ్ చేయిస్తే.. అక్కడ కూడా సాంగ్స్ బాగానే రీచ్ అవుతాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హిందీ ఆడియన్స్ కి సుపరిచితమే.
అందుకే ‘వీరసింహారెడ్డి’ విషయంలో డబ్బింగ్ వద్దనుకున్నా.. ‘వాల్తేర్ వీరయ్య’కు మాత్రం చేస్తున్నారు. పబ్లిసిటీ విషయంలో మాత్రం తగినంత శ్రద్ధ తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారికి తెలుగులో చిరు, బాలయ్య సినిమాల ప్రమోషన్స్ ను మ్యానేజ్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఇక హిందీలో ఎంతవరకు ప్రమోట్ చేయగలరో చూడాలి!