కాయిన్ ఫైట్ ప్రత్యేకంగా ఆకర్షించింది : వి వి వినాయక్
January 3, 2017 / 07:00 AM IST
|Follow Us
బాస్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ సినిమా అందరి అంచనాలకు మించి ఉండాలి. అప్పుడే సూపర్ హిట్ అవుతుంది. అందుకే దాదాపు ఏడాది పాటు 50 కథలు విన్న మెగాస్టార్ చిరంజీవి తమిళ సినిమా కత్తి కథకు ఓకే చెప్పారు. కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో చిరుకి నచ్చిన అంశం ఏమిటో తాజాగా బయటపడింది. కత్తిని తెలుగులో ఖైదీ నంబర్ 150 గా రీమేక్ చేసిన డైరక్టర్ వివి వినాయక్ ఆ సంగతిని వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ “చిరంజీవి గారంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, ఆయన ఫైట్స్ కోసం కూడా అభిమానులు థియేటర్స్ కి వస్తుంటారు. అందుకే ప్రతి చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ఉండాలని ప్లాన్ చేస్తుంటారు. కత్తిని రీమేక్ చేయడానికి కారణం ఆ చిత్రం కథ మాత్రమే కాదు.. అందులోని కాయిన్ ఫైట్. ఇంతవరకు ఏ తెలుగు చిత్రంలో ఆ విధానంలో ఫైట్ రాలేదు. మమ్మల్ని ఆ ఫైట్ అంతలా ఆకర్షించింది. మిమ్మల్ని కూడా తప్పకుండా ఆకర్షిస్తుంది” అని వివరించారు. ఆ ఫైట్ కి చిరు కొత్త హంగులు జోడించారని తెలిపారు. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి అందాలతో విందు చేయనుంది. మెగాస్టార్ 150 వ చిత్రాన్ని ఈ నెల 11 న రిలీజ్ చేయడానికి నిర్మాత రామ్ చరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.