కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ తెలివితేటలు..! టాస్క్ లో ఏం జరిగిందంటే.?
October 28, 2022 / 12:25 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ టాస్క్ మంచి మజాని ఇచ్చింది. జంటలుగా విడిపోయి చేపల చెరువు టాస్క్ ఆడిన హౌస్ మేట్స్ కెప్టెన్ అయ్యేందుకు పోటీపడ్డారు. అయితే, తక్కువ చేపలు పట్టిన కారణంగా ఆదిరెడ్డి, గీతు ఇంకా బాలాదిత్య, మెరీనా జంటలు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచీ తప్పుకున్నారు. ఎక్కువ చేపలు పట్టిన రేవంత్, ఇనయ జంట శ్రీహాన్ ఇంకా శ్రీసత్య జంటతో స్వాప్ అయ్యారు. దీంతో శ్రీహాన్ ని, శ్రీసత్యని డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించాడు బిగ్ బాస్. ఇక మిగిలిన జంటల్లోనుంచీ ఒక్కరిని ఏకాభిప్రాయంతో రమ్మని చెప్పాడు.
ఇక్కడ్నుంచీ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే హౌస్ మేట్స్ స్వార్ధం చూపించారు. గతవారం డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వెళ్లిన వాసంతీ తను కెప్టెన్సీ పోటీదారులు అవుతానని చెప్తే, సూర్య ఎక్కడా తగ్గలేదు. దీంతో ఇద్దరూ చీటిలు వేసుకున్నారు. సూర్య పేరు వచ్చింది. ఆ తర్వాత రోహిత్ ఇంకా కీర్తి ఇద్దరి పరిస్థితి ఇదే అయ్యింది. రోహిత్ హౌస్ మేట్స్ కోసం రెండు వారాల పాటు వరుసగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, కీర్తి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో చిట్టీలు వేసుకున్నారు. కీర్తి పేరు వచ్చింది. ఇక ఇనయ రేవంత్ డిస్కషన్స్ విచిత్రంగా జరిగింది. రేవంత్ కాసేపు ఇస్తానన్నాడు., మరికాసేపు కెప్టెన్సీ కావాలన్నాడు. దీంతో ఇద్దరూ చాలాసేపు తర్జనభర్జన పడ్డారు. వాళ్లు కూడా ఫైనల్ గా చిట్టీలు వేసుకున్నారు. రేవంత్ పేరు వచ్చింది. ఇనయకి బాగా బాధేసింది. లక్ కూడా తనకి ఫేవర్ చేయలేదని ఫీల్ అయ్యింది.
ఆ తర్వాత రాజ్, ఫైమా విషయంలో రాజ్ మంచి నిర్ణయం తీస్కున్నాడు. ఫైమాకి పోటీదారులు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో రేస్ లో మొత్తం ఆరుగురు పార్టిసిపేట్ చేశారు. నిజానికి హౌస్ మేట్స్ జంటలుగా ఆడినపుడు ఒకరికొకరు శాక్రిఫైజ్ చేయాల్సింది. కానీ, వాళ్ల స్వార్ధాన్ని ఇక్కడ చూపించారు. ముఖ్యంగా కీర్తి, ఇంకా సూర్య ఇద్దరూ కూడా పే బ్యాక్ ఇవ్వాల్సిన టైమ్ ని సద్వినియోగం చేసుకోలేదు. గడిచిన వారాల్లో రోహిత్ శాక్రిఫైజ్ చేసిన కారణంగానే కీర్తికి మానస్ నుంచీ వాయిస్ మెసేజ్ వచ్చింది. అలాగే, వాసంతీ లాస్ట్ గేమ్ లో నేరుగా నామినేట్ అయ్యింది. ఆ టీమ్ లో సూర్య లేకపోయినా కూడా ఒక హౌస్ మేట్ గా డిస్కషన్ విన్నాడు. అప్పుడు వాసంతీకి అన్యాయం జరిగిందని అనుకున్నారు. జైల్లో తను వాసంతీతో మాట్లాడాడు కూడా. కానీ ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారుడు అవ్వాలని కూర్చున్నాడు. దీంతో చిట్టీలు తీస్కోవాల్సి వచ్చింది.
కెప్టెన్సీ టాస్క్ లో మొదటి రౌండ్ లో చిక్కులతో ఉన్న రోప్ ని తీయాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ చాలాసేపు కష్టపడ్డారు. ఇందులో ఫస్ట్ కీర్తి, తర్వాత శ్రీహాన్, సూర్య ముగ్గురు గెలిచారు. రేవంత్, ఫైమా ఇంకా శ్రీసత్య ముగ్గురు ఓడిపోయారు. దీంతో కెప్టెన్సీ సెకండ్ రౌండ్ నిర్వహించాడు బిగ్ బాస్. కెప్టెన్సీ పోటీదారులు కెప్టెన్ పేరుతో ఉన్న జర్కిన్ వేసుకోవాలి. మిగతా హౌస్ మేట్స్ ఎవరిని రేస్ నుంచీ తప్పించాలి అనుకున్నారో వారికి కత్తిపోటు పొడిచి సరైన రీజన్ చెప్పాలి. దీంతో సూర్యకి ఎక్కువ కత్తిపోట్లు వచ్చాయి. కీర్తికి కేవలం బాలాదిత్య మాత్రమే కత్తిని దింపాడు. అలాగే, శ్రీహాన్ కి ఇనయ కత్తి పోటు దింపింది. దీంతో శ్రీహాన్ కాస్త ఫీల్ అయ్యాడు. ఇక ఇంటి తదుపరి కెప్టెన్ గా శ్రీహాన్ ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆదిరెడ్డి వాళ్ల పాప బర్త్ డే వేడుకల్ని ఇంట్లో వీడియో చూపించారు. అదీ మేటర్.