Bigg Boss Telugu 5: టిక్కెట్ టు ఫినాలే రేస్ లో ముందున్నది ఎవరో తెలుసా..?

  • December 1, 2021 / 01:54 PM IST

బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా మూడు లెవల్స్ లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్లు ఈ టిక్కెట్ ని దక్కించుకుంటారు. అయితే, లెవల్స్ దాటేటపుడు బోటమ్ లో ఉన్న ఇద్దరూ ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఇక్కడే ఫస్ట్ లెవల్లో ఐస్ టబ్ , బాల్స్ టాస్క్ ని ఆడుతున్నారు హౌస్ మేట్స్. ఇందులో మానస్ 11 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నాడట. ఫస్ట్ పొజీషన్ లో ఈ టాస్క్ లో గెలిచినట్లుగా చెప్తున్నారు.

సెకండ్ పొజీషన్ లో సిరి, శ్రీరామ్ 10 పాయింట్స్ ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక 9 పాయింట్స్ లో షణ్ముక్ మూడో స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, బిగ్ బాస్ కాల్ తీస్కుని షణ్ముక్ ని, సన్నీని స్వాప్ చేయడం జరిగింది. ఇక్కడే సిరికి, ఇంకా సన్నీకి ఫుల్ ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి.మరి టాస్క్ లో సన్నీ ఏ పొజీషన్ లో ఉన్నాడనేది తెలియదు కానీ, పింకీ ఇంకా కాజల్ ఇద్దరూ కూడా బోటమ్ లో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మాత్రం ఫస్ట్ లెవల్లో పింకీ ఇంకా కాజల్ ఇద్దరూ అవుట్ అయినట్లుగానే తెలుస్తోంది.

ఇక మానస్ ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నాడు. ఇంకా రెండు లెవల్స్ ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా మానస్, శ్రీరామ్ ఇద్దరిలోనే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక వీరితో పాటుగా సిరి కూడా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా రెండు లెవల్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ గెలుచుకునే పాయింట్స్ పైనే టిక్కెట్ టు ఫినాలే అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ఇద్దరి హౌస్ మేట్స్ లో టై బ్రేక్ వస్తే మాత్రం ఖచ్చితంగా నాలుగో లెవల్ టాస్క్ కూడా పెడతారు. ఇందులో గెలిచిన వాళ్లు నేరుగా టాప్ 5లోకి వెళ్తారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus