Suriya: సూర్య పాన్ ఇండియా సినిమా మీద మళ్లీ ఆశలు.. ఎప్పుడు షురూ!
May 17, 2024 / 02:17 PM IST
|Follow Us
ఇండియన్ సినిమాలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాల లిస్ట్ ఇప్పటికప్పుడు రాస్తే చాలానే కనిపిస్తాయి. ఎందుకంటే పాన్ ఇండియా ఫీవర్ ఆ లెవల్లో ఉంది. అయితే ప్రముఖంగా తమిళ సినిమాలు చూస్తే అందులో సూర్య )(Suriya) – శివ (Siva) ‘కంగువ’ (Kanguva) కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా మీద టీమ్‌కు భారీ అంచనాలు కూడా ఉన్నాయి. సూర్య కెరీర్లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా భారీ చిత్రం కావడం దానికి ఓ కారణం. మిగిలిన కారణాలు చాలానే ఉన్నాయి అనుకోండి.
అయితే, సూర్య భారీ చిత్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాతో పాటు మరో సినిమా గురించి మనం చెప్పుకోవాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆ సినిమా ఓ దశకు వచ్చి ఉండేది కూడా. కానీ అవ్వలేదు. ఇప్పుడంటే బాలీవుడ్లో ‘రామాయణం’ గురించి మాట్లాడుతున్నారు కానీ.. అందులోని ఓ కీలక అంశంతో మరో యాంగిల్లో రామాయణం చూపించాలని సూర్య ఎప్పుడో ప్లాన్ చేశారు. అదే ‘కర్ణ’. రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఏడాది క్రితం అనౌన్స్ అయింది.
అవునా? అని మీరు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలా ప్రకటించిన తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి. షూటింగ్ ప్రారంభం కాకపోయినా సమాచారం అయినా ఇస్తే బాగుండేది. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారమూ జరిగింది. సుమారు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆ సినిమా తెరకెక్కిస్తారు అని అప్పట్లో మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనే డౌట్ రావొచ్చు. ఎందుకంటే ఆ సినిమా ముచ్చట్లు మళ్లీ ఇప్పుడు వినిపిస్తున్నాయి.
బడ్జెట్, సూర్య డేట్లు అందుబాటులో లేకపోవడంతో ఇన్నాళ్లు సినిమా స్టార్ట్ చేయలేదు. ‘కంగువ’ పనులు కొలిక్కి రావడం, బడ్జెట్‌ని సవరించడం లాంటి కారణాల వల్ల సినిమా త్వరలో ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. ‘కంగువ’ తర్వాత వెట్రిమారన్ (Vetrimaaran) ‘వడివాసల్’ ఉంది. ఇది కాకుండా లోకేష్ కనగరాజ్‌తో (Lokesh Kanagaraj) ‘రోలెక్స్’ ఉంది. మరి సూర్య ఏం చేస్తారో చూడాలి.