Vijay: షూటింగ్లో విజయ్ గాయపడ్డాడా? ఆ ఫొటో వైరల్.. ఏమైందంటే?
April 25, 2024 / 04:16 PM IST
|Follow Us
ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ (Vijay Thalapathy) గాయపడ్డాడా? ఏమో రీసెంట్గా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఓ సందర్భంలో తీసిన ఫొటోలను నిర్మాణ సంస్థ ట్వీట్ చేయగా.. అందులో విజయ్ చేతికి చిన్న కట్టు చూసి ‘విజయ్ గాయపడ్డాడా?’ అంటూ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో విజయ్ టీమ్ వెంటనే స్పందించాలి అని కూడా కోరుతున్నారు. విజయ్ – త్రిష (Trisha) నటించిన ‘గిల్లి’ (Ghilli) సినిమా ఇటీవల రీరిలీజ్ అయ్యి భారీ విజయం అందుకుంది.
వసూళ్ల వర్షం కురుస్తుండటంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం (A. M. Rathnam) కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకే వాళ్లు కూడా విజయ్ను కలసి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్‌కు పెద్ద దండ ఒకటి వేసి అభినందనలు తెలిపారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఆ ఫొటోల్లో విజయ్ చేతికి ఓ కట్టు కనిపిస్తోంది. దీంతో విజయ్ ఏమన్నా షూటింగ్లో గాయపడ్డాడా అనే ప్రశ్న మొదలైంది.
డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌ల్లో నటించడం విజయ్‌కు అలవాటు. ఈ క్రమంలో ఏమన్నా కొత్త సినిమా షూటింగ్లో గాయపడ్డాడా అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ ‘ది గోట్’ (The GOAT) అనే సినిమాలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్. ఈ సినిమా షూటింగ్‌లోనే విజయ్ గాయపడి ఉండొచ్చు అని సమాచారం. ఈ విషయంలో టీమ్ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమా కోసం విజయ్ మీసం, గెడ్డం తీసేసి యంగ్ లుక్‌లో కనిపించారు.
ఇక ఈ సినిమాను సెప్టెంబరు 5 రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒక పాత్ర కోసం డీఏజినింగ్ టెక్నాలజీ వాడి యంగ్ లుక్‌లోకి విజయ్ను మార్చారట. మరోవైపు దివంగత కెప్టెన్ విజయ్‌కాంత్‌ను ఏఐ ద్వారా ఈ సినిమాలో నటింపజేశారట. ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో.. ఈ సినిమా ఫలితం మీద భారీ అంచనాలే ఉన్నాయి.