అదికాదు ఇమ్మూ.. అలా ద‌గ్గ‌ర‌కు రావొద్దు వర్ష‌..!

  • December 5, 2020 / 07:10 PM IST

తెలుగు బుల్లితెర ఖ‌త‌ర్నాక్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. గురువారం, శుక్ర‌వారం వ‌స్తుందంటే చాలు, న‌వ్వుల్లో మునిగిపోవ‌డానికి తెలుగు ప్ర‌జ‌లు టీవీల‌కు అతుక్కుపోతారు. స్కిట్ల‌లో వేసే కొన్ని డబుల్ మీనింగ్ పంచ్‌లు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని కాస్త ఇబ్బంది పెట్టినా, జ‌నాలను మాత్రం ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో జ‌బ‌ర్ధ‌స్త్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఇలాంటి కామెడీ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు యాంకర్ అన‌సూయ‌, ర‌ష్మీలు గ్లామ‌ర్ ట‌చ్ ఇస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్‌లో అన‌సూయ స్కిన్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాగే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌లో ర‌ష్మీ స్కిన్ షోతో పాటు సుధీర్‌తో ట్రాక్ హైలెట్ అని చెప్పాలి. ర‌ష్మీ-సుధీర్ కెమిస్ట్రీ కార‌ణంగా జ‌బ‌ర్ధ‌స్త్ టీఆర్పీ ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది.

ఆ కెమిస్ట్రీ టాక్ కార‌ణంగానే సుధీర్ అండ్ ర‌ష్మీల జోడీ ఫుల్లుగా ఫేమ‌స్ అయ్యారు. దీంతో వారిద్ద‌రి మ‌ద్య వ్య‌వహారం ఎక్క‌డికో వెళుతుంద‌ని, ఇద్ద‌రు నిజంగానే ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని యూట్యూబ‌ర్స్ తేల్చేశారు. దీంతో ఇద్ద‌రు మీడియా ముందుకు అనేక‌సార్లు త‌మ ఇద్ద‌రి మ‌ద్య కెమిస్ట్రీ కేవ‌లం స్టేజ్‌పైనే అని, బ‌య‌ట ఇద్ద‌రం మంచి మిత్రుల‌మే అని తేల్చిచెప్పారు. అయినా సుధీర్, రష్మీల ల‌వ్‌ట్రాక్ పై రోజుకో గాస్సిప్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొద్దిరోజులుగా జ‌బ‌ర్థ‌స్త్‌లో మ‌రో జంట మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని తాజా ఎపిసోడ్స్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతోంది. ఈ మ‌ధ్య కొత్త జంట ఇమ్మాన్యుయేల్ అండ్ వ‌ర్ష‌ల పేర్లు జ‌బ‌ర్ధస్త్‌లో ఎక్కువ‌గా వినిపిస్తోంది.

జ‌బ‌ర్ధ‌స్త్‌లో ఎవ‌రికి వాళ్ళుగా వేరే వేరే టీమ్‌లీడ‌ర్ల స్కిట్ల‌లో ఎంట్రీ ఇచ్చినా, కెవ్వు కార్తిక్ టీమ్‌లో ఈ ఇద్ద‌రు క‌లిసి చేసిన స్కిట్ భ‌లే క్లిక్ అయ్యింది. ఇమ్ము, వ‌ర్ష‌ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగా వ‌ర్క‌వుట్ కావ‌డంతో జ‌బ‌ర్ధ‌స్త్ మేక‌ర్స్ ఎక్కువ‌గా వాళ్ళ‌నే హైలెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా విడుద‌లైన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోమో చూస్తే, ఈ కామెడీ షోలో మ‌రో ప్రేమ క‌థ మొద‌లైంద‌ని అనిపిస్తోంది. అయితే అదంతా స్కిట్‌లో భాగంగానే అయినా, స్టేజ్‌పై ఇద్ద‌రి కెమిస్ట్రీ, ఇద్ద‌రి మాటలు, చేత‌లు చూసేవారిని ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో సుధీర్‌,ర‌ష్మీల జంట త‌ర్వాత ఇంత‌లా హైలెట్ అవుతోంది మాత్రం ఇమ్ము,వ‌ర్ష‌ల జంటే అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus