రాధిక ఆప్టే తొడపై పచ్చబొట్టు గురించి డిస్కషన్స్

  • May 7, 2019 / 09:51 PM IST

సౌత్ హీరోల మీద, సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో ఎప్పుడు హైలైట్ అవుతుండే రాధిక ఆప్టే మంచి నటి అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆమె కొందరు హీరోలు, దర్శకనిర్మాతల కారణంగా ఎదుర్కొన్న సమస్యలు ఆమెను తెలుగు చిత్రసీమ నుంచి దూరం చేశాయి. బాలీవుడ్ లో విరివిగా సినిమాలు చేస్తోంది. అయితే.. కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయింది. అలాగే.. హీరోయిన్ గానూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

రీసెంట్ గా ఓ ఈవెంట్ కు స్టైలిష్ డిజైనర్ డ్రెస్ ధరించి హాజరయింది రాధికా ఆప్టే. థై స్లిట్ గౌన్ కావడంతో ఆమె తొడపై పొడిపించుకున్న చిన్నపాటి పచ్చబొట్టు కెమెరాల కంటికి చిక్కింది. దాంతో ఆమె పచ్చబొట్టు క్లియర్ గా కనిపిస్తున్న ఫోటోలు మీడియాలోకి వచ్చేశాయి. తన ప్రియమైన భర్త బెనెడిక్ట్ టేలర్ ఇనిషియల్స్ ‘B’ ను తన తొడపై టాటూగా వేయించుకుంది. ఈ ఫోటోలు బైటకు రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus