మనోజ్ తో ప్రణతి రెడ్డి ఎందుకు విడిపోయింది.. ఇప్పుడేం చేస్తుంది..!
September 14, 2022 / 07:31 PM IST
|Follow Us
మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ ‘దొంగ దొంగది’ ‘బిందాస్’ ‘నేను మీకు తెలుసా’ ‘కరెంట్ తీగ’ వంటి చిత్రాలతో అలరించాడు. మంచు ఫ్యామిలీలో ఉన్న వారిలో ఇతను ‘సెన్సిబుల్ గయ్’ అని అంతా అంటుంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్లు చేయడు. అయితే ఇటీవల కాలంలో మనోజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మనోజ్ నుండి సినిమాల్లో నటించి 4 ఏళ్ళు దాటింది.
కాకపోతే గతంలో అతను కేమియోలు ఇచ్చిన సినిమాలు విడుదల ఆలస్యం కావడంతో మొన్నామధ్య రిలీజ్ అయ్యాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక ని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ విషయం పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రణతి రెడ్డి అమెరికాలో ఉంటుంది. ఆమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్. తన పనిలో బిజీగా ఉంటూ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తుందట. మనోజ్ – ప్రణతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. విష్ణు భార్య విరానికా రెడ్డి స్నేహితురాలు మరియు దూరపు బంధువు అయిన ఈమెను మనోజ్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
కానీ పెళ్లైన కొంత కాలానికి వీరి మధ్య మనస్పర్థలు సంభవించాయి. ఓ దశలో ప్రణతి రెడ్డి కూడా డిప్రెషన్ కు గురైందట. ఆ టైంలో ఈమె నా దేవత అంటూ మనోజ్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. అప్పటికే వీరు విడిపోయారు అంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ ఆ పోస్ట్ తో మనోజ్ మేనేజ్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ విషయాన్ని ఎక్కువ కాలం దయలేకపోయాడు.