ఒక సినిమా.. ఆ సినిమాలో నటించిన నటుడికి స్టార్ డమ్ అయినా తీసుకురావాలి లేదా గుర్తింపు అయినా తీసుకురావాలి. కానీ.. “అల వైకుంఠపురములో” సినిమాతో సుశాంత్ కి ఏం లభించింది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మిగిలిపోయింది. విడుదలకు ముందు అల్లు అర్జున్ & త్రివిక్రమ్ ఇంటర్వ్యూల్లో సుశాంత్ కి ఇచ్చిన ఎలివేషన్ కి సినిమాలో మనోడిది చాలా ఇంపార్టెంట్ రోల్ అని జనాలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. వాళ్ళు చెప్పినట్లు సినిమాలో సుశాంత్ ది నిజంగానే చాలా ఇంపార్టెంట్ రోల్.. కానీ సినిమాలో ఆ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది కానీ క్యారెక్టర్ ఎలివేషన్ కానీ ఆర్క్ కానీ ఎక్కడా కనిపించదు. సినిమా మొత్తంలో సుశాంత్ కి డైలాగులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రీక్లైమాక్స్ లో ఒక సీన్ & ఎండ్ క్రెడిట్స్ లో వచ్చే ఒక సీన్ లో తప్పితే సుశాంత్ గట్టిగా సినిమాలో ఎక్కడా మాట్లాడింది కూడా లేదు. సొ, “అల వైకుంఠపురములో” సినిమా సుశాంత్ కి నటుడిగా హెల్ప్ అయ్యింది కానీ.. అతడ్ని ఎలివేట్ చేసింది కానీ ఏమీ లేదు.
అయితే.. అతడి గుర్తింపును కానీ మార్కెట్ ను కానీ ఏమైనా పెంచిందా అనేది తెలియాలంటే సుశాంత్ తదుపరి చిత్రం విడుదల వరకు వెయిట్ చేయాలి. మురళీశర్మ, సచిన్ కేడ్కర్, జయరాం, టబు వంటి వారు కూడా హైలైట్ అయిన సినిమాలో సుశాంత్ కు ప్రత్యేకమైన గుర్తింపు లభించకపోవడం ఒకరకంగా ఆలోచించాల్సిన విషయమే.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!