భార్య బర్త్ డే కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన ఎన్టీఆర్..?
March 22, 2021 / 06:16 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మరోవైపు కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. షూటింగ్ లు లేకపోతే ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించే జూనియర్ ఎన్టీఆర్ భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు కాగా పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ భార్య పేరుపై ఖరీదైన ఫామ్ హౌస్ ను రాశారని తెలుస్తోంది.
కొత్త ఫామ్ హౌస్ లోనే ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో ఎన్టీఆర్ భార్యకు ఇచ్చిన గిఫ్ట్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలను జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఆయన భార్య కానీ ధృవీకరించాల్సి ఉంది. ఎన్టీఆర్ ఈ ఫామ్ హౌస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ విషయంలో లక్ష్మీ ప్రణతి ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.
2011 సంవత్సరం మే నెల 5వ తేదీన తారక్, లక్ష్మీ ప్రణతిల వివాహం ఘనంగా జరిగింది. తారక్ ప్రణతి జంటకు 2014 సంవత్సరంలో అభయ్ రామ్ జన్మించగా 2018 సంవత్సరంలో భార్గవ్ రామ్ జన్మించారు. మరోవైపు నిన్న జూనియర్ ఎన్టీఆర్ కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది.
జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్ పై ఉన్న సమయంలో కొందరు అభిమానులు స్టేజ్ పైకి దూసుకొస్తూ ఎన్టీఆర్ ను కొంత ఇబ్బంది పెట్టారు. ఆ తరువాత హద్దు మీరి ప్రవర్తించిన అభిమానులపై ఎన్టీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.