శ్రీను వైట్ల ‘మిష్టర్’ పరిస్థితి ఏంటి??

  • April 20, 2016 / 06:20 AM IST

శ్రీను వైట్ల…ఒకప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్, రెడీ తో మొదలు పెట్టి…దుబాయ్ శీను,బాద్ షా, దూకుడు వంటి బ్లాక్ బస్టర్స్ తో టాప్ డైరెక్టర్ గా మంచి స్థానంలో ఉన్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎత్తు పల్లాలు సహజం..జయాపజయాలు వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. అదే క్రమంలో మహేష్ బాబు ఆగడు, రామ్‌చరణ్ బ్రూస్ లీ చిత్రాలు భారీ డిజస్టర్స్ కావడంతో ఒక్కసారిగా ఈ దర్శకుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక అదే క్రమంలో ఆయన కుటుంబ కలహాలు కూడా తెరపైకి రావడంతో మానసిక వత్తడితో కొంత కాలం సతమతమయ్యాడు. ఇక అవన్నీ పక్కన పెట్టి మళ్లీ తన టాలెంట్ కు పదును పెడుతూ మరో సినిమాతో తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక శ్రీను వైట్ల – గోపి మోహన్ – కోన వెంకట్ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వాళ్ళు ముగ్గురూ కలిసారంటే సినిమా హిట్ అన్న మాటే. ఇదిలా ఉంటే తాజాగా శ్రీను వైట్ల మెగా హీరో ‘వరుణ్ తేజ’తో చేస్తున్న సినిమా ‘మిష్టర్’. ఈ సినిమాకు సైతం ఆ ముగ్గురు కలసి పనిచేస్తారని అందరూ భావించారు. కానీ గతంలో కోన మరియు శ్రీనుకు మధ్య జరిగిన సంఘటనలు, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం, అంతేకాకుండా బహిరంగంగా ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపించడం వల్ల శ్రీను మరోసారి కోనతో పని చెయ్యడం ఇష్టం లేక ఈ సినిమాకు రైటర్ గా గోపీమోహన్ ను మాత్రం తీసుకున్నాడు. అయితే సోలో రైటర్ గా హిట్లు కొట్టిన నేపథ్యం కూడా గోపీమోహన్ కి వుంది. అందువల్లనే ఆయనని శ్రీను వైట్ల తీసుకున్నాడని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ ఇరువురి కాంబినేషన్ ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus