Jeevitha: ‘మా’ ఎన్నికల వేడిలో కొత్త విషయాలు బయటికొస్తాయా…!

  • October 4, 2021 / 01:14 PM IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఫైనల్‌ అభ్యర్థుల జాబితా కూడా వచ్చేసింది. మరో ఆరు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రచారం జోరందుకుంది. ఓవైపు ప్రకాశ్‌రాజ్‌ డిన్నర్‌ పార్టీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు.. సీనియర్‌, స్టార్‌ నటుల్ని కలసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం మరో రకం వేడి రాజుకోబోతోందా? అవుననే అంటున్నాయి ‘మా’ వర్గాలు.

‘మా’ ఎన్నికలకు సంబంధించి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసినట్లు నటి జీవిత రాజశేఖర్‌ తరఫు బృందం ఇప్పటికే సందేశాలు పంపించారు. అందులో ‘మా’ ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలు మాట్లాడతారని చెబుతున్నారు. దీంతో జీవిత ఇప్పుడేం మాట్లాడతారు అనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుత ప్యానల్‌లో జనరల్‌ సెక్రటరీగా ఉన్న జీవిత… ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోనూ అదే పదవి కోసం బరిలో ఉన్నారు. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌… ఇటీవల విష్ణు ప్యానల్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జనరల్‌ సెక్రటరీ పని తీరు గురించి, విధుల గురించి కొన్ని విమర్శలు చేశారు. జనరల్‌ సెక్రటరీ అంటే కేవలం మెసేజ్‌లు పంపడమేనా అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు జనరల్‌ సెక్రటరీ వల్లే కొన్ని పనులు ఆగిపోయాయని కూడా అన్నారు. ఇప్పుడు జీవిత ఏం మాట్లాడతారో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus