Hero Nani: థియేటర్ – ఓటీటీ గురించి నాని ఏం చెప్పాడంటే!?
September 3, 2021 / 11:37 AM IST
|Follow Us
థియేటర్లు – నాని – ఓటీటీ… గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. ‘టక్ జగదీష్’ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా… ఓటీటీకి ఇస్తున్నారు అంటూ థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ నోరు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత మరో ప్రెస్‌నోట్‌లో క్షమించమని అడిగారు కూడా. అయితే అనాల్సినవి అనేశారు. ఈ నేపథ్యంలో థియేటర్లతో తనకున్న అనుబంధం గురించి నాని మాట్లాడారు.
థియేటర్ వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నా అని చెప్పిన నాని…. తన సినిమా విడుదలవుతుందంటే థియేటర్‌కి వెళ్లి తలుపు దగ్గర రెండున్నర గంటలు నిలబడి ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకువారట. అలాంటి నేను థియేటర్‌కు దూరం కాను అంటూ భావోద్వేగంతో చెప్పారు నాని. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘టక్ జగదీష్’ను ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాడు నాని. ఇలా సినిమాను ఓటీటీకి ఇవ్వడం వల్ల కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి.
ఒక్కో సినిమా వల్ల వందల మందికి ఉపాధి దొరుకుతుంది. నిర్మాతలకూ ఇబ్బంది ఉండదు అంటూ తమ ‘టక్ జగదీష్’ థియేటర్లకు కాకుండా… ఓటీటీకి వెళ్లడం వెనుక తమ ఉద్దేశం అని చెప్పాడు నాని. ఇప్పటికైనా నాని మనసులో భావాన్ని అర్థం చేసుకుంటారేమో… థియేటర్ల వాళ్లు.